Monday, January 31, 2011

చిన్నా(ధర్మారావు),Chinna (Dharmarao)


కలలు రెండు రకాలు. నిద్ర పోయినప్పుడు వచ్చి మెలకువతో కరిగిపోయేవి మొదటివి. నిద్ర పట్టనివ్వకుండా చేసేవి రెండో రకం. నిద్రలో కనే కలలతో ఇబ్బందేం లేదు. లేవగానే వాటిని మర్చిపోతాం. ఈ రెండో రకంతోనే సమస్య అంతా. అవి మనిషిని ఒకచోట నిలవనివ్వవు. కళ్లు మూసుకోనివ్వవు, ఇరవైనాలుగ్గంటలూ త్వరపెడతాయి, ముందుకు పదమని వెంటపడతాయి.

'నేను వందమందికి అన్నం పెట్టే స్థాయికి ఎదగాలి' అని అతి మామూలు ఐటీఐ డిప్లమో కుర్రాడు కన్న కల ఎలా నిజమయింది? ఎలాగంటే - సినిమాల్లో ఆర్ట్ డైరెక్షన్ వయా సిరామిక్ కంపెనీ ఉద్యోగం వయా ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ వయా మెళియాపుట్టిలో పుట్టిన పంతం. ఈ ప్రయాణంలో ఎగుడుదిగుళ్లన్నీ తెలియాలంటే విశాఖపట్నం శివార్లలో వివాదాస్పదమైన సినిమా సెట్ దగ్గరకు వెళ్లాలి. ఆర్ట్ డైరెక్టర్ చిన్నాను పలకరించాలి.

'మీ శ్రీకాకుళం జిల్లా మనిషే' అని మీడియా మిత్రులు హాస్యంగా పరిచయం చేస్తుంటే చిన్నా తలదించుకుని సిగ్గుగా నవ్వారు. ఒకవైపు జోరుగా సాగుతున్న సెట్ నిర్మాణం. బల్లలు కొడుతున్నవారు కొందరు, చెక్కను చిత్రిక పడుతున్నవారు కొందరు, రంగులు వేస్తున్నవారు కొందరు, నాటిన రకరకాల పూలమొక్కలకు నీళ్లు పోస్తున్నవారు కొందరు - వెరసి హడావుడిగా ఉంది వాతావరణం. అంతమంది మనుషుల మధ్య చిన్నాను ప్రత్యేకంగా పోల్చుకోవడం కష్టం. ఆయనేం నీడ పట్టున కుర్చీలో కూర్చోడు. చేతికీ, మెడలోనూ బంగారు గొలుసులు, కళ్లకు చలవ కళ్లద్దాలూ ఇవేమీ ఉండవు. పనివాళ్లతో కలిసిపోయి వాళ్లతో మాట్లాడుతూ అవసరమైతే తానే స్వయంగా పనిచేసి చూపిస్తూ ఉండే చిన్నా 'పోకిరి' 'నాగవల్లి' వంటి భారీ చిత్రాల కళాదర్శకుడంటే నమ్మడం కష్టమే.

అక్కడున్న రణగొణ ధ్వనుల మధ్య, చిన్నా గొంతూ వినిపించదు. అంత నెమ్మదైన, సౌమ్యమైన మాటతీరు ఆయనది. మెళియాపుట్టిలో పుట్టి పెరిగిన చిన్నా "నాకు మా ఊరంటే చాలా ఇష్టమండీ. అక్కడో గుడి కట్టాలని ప్రయత్నంలో ఉన్నాను. ఒక వృద్ధాశ్రమం నిర్మిస్తున్నా. నాకు ఇవాళ సంపాదన ఉందిగానీ రేపు ఎలా ఉంటుందో తెలియదు. నా పరిస్థితి ఎలా ఉన్నా సరే వృద్ధాశ్రమం ఇబ్బంది పడకూడదని దానికో శాశ్వతమైన ఆదాయ వనరును కల్పించే ప్రయత్నాల్లో ఉన్నా. అలాగే డబ్బులేక చదువు ఆగిపోయే విద్యార్థులను చూసినా చాలా బాధ కలుగుతుంది..'' అనే చిన్నా ఇప్పటికి ముగ్గురిని ఇంజినీరింగ్, మరొకరిని మెడిసిన్ చదివించారు. దానికీ ఓ కథ ఉంది. చదువు కోసం తాను పడిన కష్టమే దానికి భూమిక.

చిన్న ఉద్యోగం, పెద్ద సద్యోగం...
చిన్నప్పుడే తండ్రి పోతే నలుగురు అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ల మధ్య పెరిగిన చిన్నా తెలిసీతెలియని వయసు పంతంతో పదహారేళ్లకే ఇల్లు వదిలేశాడు. వైజాగ్‌లో ఐటీఐ చదువు తర్వాత నేరుగా తిరుపతి చేరుకుని ఒక సిరామిక్ టైల్స్ కంపెనీలో చిరుద్యోగిగా చేరాడు. నెలకు 390 రూపాయల జీతం. మెస్ ఖర్చులు పోను చేతికి వచ్చేది 165రూపాయలు. అదీ తొలినెల సంపాదన. తినీతినకా రోజులు గడిచేవి. అయితే ఆకలికి బదులు అతని కళ్లలో ఒక కల జీవం పోసుకుంది. 'ఎప్పటికయినా ఇలాంటి సంస్థను స్థాపించి దానికి ఎండీగా నేనుండాలి, వందమందికి అన్నం పెట్టాలి' అని.

ఐటీఐతో అలాంటి కలలు నెరవేరవని అతనికి స్పష్టంగా తెలుసు. దానికోసం బాగా చదువుకోవాలి. తిండి సంగతి తర్వాత చూసుకుందాం, ముందు చదువు పని పట్టాలనుకున్నాడు చిన్నా. సాయంత్రం కాలేజీలో చేరి ఏఎమ్ఐఈ డిగ్రీ పొందడానికి శ్రమించేవాడు. చేస్తున్న కొలువులో కుర్రాడు పెడుతున్న శ్రద్ధ, చదువుకోసం పడుతున్న అవస్థలూ సంస్థ యాజమాన్యం దృష్టికి వచ్చాయి. జీతం 750 రూపాయలైంది, మరో 750 ఇంటికి పంపించేవారు. ఏడున్నరేళ్లు గడిచాయి. ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పట్టా చేతికొచ్చింది. కదులుతూ ఉంటేనే చైతన్యం ఉన్నట్టు. కదిలేదానికే శక్తి ఉన్నట్టు. ఉన్న చోటును వదిలి ఎమ్ఆర్ఎఫ్ సంస్థలో చేరుదామని చెన్నై చేరాడు చిన్నా.

'తొలిప్రేమ'లో మునిగి 'పోకిరి'గా తేలి...
చెన్నై చిత్రసీమలో కళాదర్శకుడు బి.చలం అంటే పేరున్న మనిషే. చిన్నాకు వరుసకు తాతయ్యవుతారు. ఆయనకు చిన్నా కలిశారు. అక్కడ చలం కుమారుడు ఆనంద్‌సాయితో స్నేహం పెరిగింది. అతను కూడా కళాదర్శకత్వంలో రాణించాలని శ్రమిస్తున్న రోజులవి. పవన్ కళ్యాణ్ హీరోగా 'తొలిప్రేమ' మొదలైంది. ఆర్ట్ డైరెక్షన్ అవకాశం ఆనంద్‌సాయికే దక్కింది. 'ఇంకెందురా ఉద్యోగాలంటూ తిరుగుతావు? నాతో వచ్చెయ్. ఇద్దరం ఇందులోనే ఎదుగుదాం' అన్నారాయన. అక్కడ చిన్నా కథ మలుపు తిరిగింది. 'ఆనందం'తో మరో మెట్టెక్కింది.

ఎవరి పాపపుణ్యాలు వారివే
ఖుషీ, దేశముదురు, సూపర్, ఆంధ్రావాలా, చిరుత, యోగి, బుజ్జిగాడు, ఏక్‌నిరంజన్, హ్యాపీ, పోకిరి, కొంచెం ఇష్టం కొంచెం కష్టం.... చిన్నా కళాదర్శకుడిగా పనిచేసిన చిత్రాల జాబితా మొన్నమొన్నటి నాగవల్లిని కూడా కలుపుకొని ఇంకాఇంకా ముందుకెళుతోంది. "సిరామిక్ టైల్స్ ఫ్యాక్టరీ పెట్టాలన్న కల కరిగిపోయిందిగానీ నలుగురికీ ఉపాధి కల్పించాలన్న మూల సూత్రం అయితే నెరవేరింది. అలాగే అందమైన బాల్యాన్నిచ్చిన మా ఊరికి తోచిన సాయమూ చేయగలుగుతున్నాను.

అయితే ఒక టి, పది లక్షలు ఖర్చుపెట్టి గుడి స్లాబ్ వరకూ వేశాను. కానీ పల్లెటూరి వాతావరణం అనారోగ్యకరంగా మారిపోయింది. రాజకీయాలు, వ్యక్తిగత స్వార్థాలు గ్రామీణుల స్వచ్ఛతను హరించాయి. దానివల్లే వేగంగా అనుకున్నవన్నీ పూర్తిచేయలేకపోతున్నా'' అంటున్న చిన్నాను మధ్యలో ఆపి 'సినిమారంగంలో కూడా అబద్ధాలు, మోసాలు పనిచేయించుకున్నాక డబ్బులు ఎగ్గొట్టడాలు.. ఇవన్నీ ఉంటాయిగా' అంటే ఆయన చిన్నగా నవ్వుతాడంతే.

'ఎవరి పాపపుణ్యాలు వాళ్లవేనండీ' అనే చిన్నా షిరిడీ సాయిబాబా భక్తుడు. "ఇంట్లో ఏం ఇబ్బంది లేదండి. ఇదిగో వీళ్లకి సాయం చేశానంటే వాళ్లకు కూడా చెయ్యి - అనే భార్య, ఇద్దరు చక్కటి కొడుకులున్నారు. ఊళ్లో అనుకున్నవి అయిపోతే మరింకేం అక్కర్లేదు. బాబా ఆశీర్వాదంతో అయిపోతాయనుకోండి' అనే చిన్నా అసలు పేరు ధర్మారావు. అలాగని ఎవరికీ తెలియదు. పేరులో ధర్మం, మనసులో సంకల్పబలం రెండూ ఉన్న చిన్నా తలపెట్టిన మంచి పనులన్నీ పూర్తవుతాయి. ఎందుకు కావు?

--జూ అరుణ పప్పు, విశాఖపట్నం, ఫోటోలు : వై. రామకృష్ణ(Andhrajyothi news paper)


  • ====================================
Visit my website -> Dr.seshagirirao-MBBS

Tuesday, January 11, 2011

సోమయాజులు జె.వి , Somayajulu J.V.


======================================
పరిచయం :
  • జొన్నలగడ్డ వెంకట సోమయాజులు '(జె.వి.సోమయాజులు) శంకరాభరణం శంకరశాస్త్రిగా తెలుగు ప్రజలకు సుపరిచితుడైన తెలుగు చలనచిత్ర నటుడు. మరొక నటుడు జె.వి. రమణమూర్తి ఇతని సోదరుడు.
  • ఇతడు శ్రీకాకుళం జిల్లా ఉర్లాం వద్ద 'లుకలాం' అగ్రహారానికి చెందినవాడు. ఇతని తండ్రి ప్రభుత్వోద్యోగి. సోమయాజులు నిజయంనగరంలో చదువుకొన్నప్పటినుండి నాటకాలు వేసేవాడు. తన సోదరుడు రమణమూర్తితో కలిసి గురజాడ అప్పారావు ప్రసిద్ధ నాటకం కన్యాశుల్కాన్ని 45 యేళ్ళలో 500 ప్రదర్శనలు ఇచ్చాడు. ముఖ్యంగా కన్యాశుల్కంలో "రామప్పంతులు" పాత్రకు ప్రసిద్ధుడయ్యాడు. సోమయాజులు తల్లి శారదమ్మ అతనిని ప్రోత్సహించింది.
ప్రొఫైల్ :
  • పేరు : జొన్నలగడ్డ వెంకట సోమయాజులు '(జె.వి.సోమయాజులు)
  • పుట్టిన తేది : *-*-1928 ,
  • మరణము : *27-ఏప్రిల్ -2004 .,గుండె పోతూ తో హైదరాబాద్ లో మరణించారు ,
  • ఊరు : లుకలాం అగ్రహారం - ఉర్లం దగ్గర , శ్రీకాకుళం జిల్లా ,
  • సోదరుడు : జె.వి.రమణమూర్తి (నటుడు ),
  • తండ్రి : ఎక్ష్ సైజ్ డిపార్టుమెంటు లో పోలీస్ ఇన్స్పెక్టర్ గా పనిచేసారు.,
  • తల్లి : సరదమ్మ - ఈయన సక్సెస్ వెనక ఉండి ప్రోస్తాహించేవారు .
  • ఉద్యోగం : విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసు గా పనిచేసారు .
ఫిల్మోగ్రఫీ :
  • ఒండగోన బా (2003)
  • కబీర్ దాస్ (2003)
  • సరిగమలు (1994)
  • గోవిందా గోవిందా (1993)
  • ముఠా మేస్త్రీ (1993)
  • అల్లరి మొగుడు (1992)
  • రౌడీ అల్లుడు (1991)
  • ఆదిత్య 369 (1991)
  • అప్పుల అప్పారావు (1991)
  • ప్రతిబంధ్ (హిందీ) (1990)
  • స్వరకల్పన (1989)
  • ఇడు నమ్మ అలు (1988)
  • స్వయంకృషి (1987)
  • చక్రవర్తి (1987)
  • మగధీరుడు (1986)
  • ప్యార్ కా సింధూర్ (హిందీ) (1986)
  • ఆలాపన (1986)
  • కళ్యాణ తాంబూలం (1986)
  • శ్రీ షిర్డీ సాయిబాబా మహత్యం (1986)
  • తాండ్ర పాపారాయుడు (1986)
  • విజేత (1985)
  • దేవాలయం (1985)
  • స్వాతిముత్యం (1985)
  • సితార (1983)
  • పెళ్ళీడు పిల్లలు (1982)
  • వంశవృక్షం (1980)
  • సప్తపది (1980)
  • శంకరాభరణం (1979)
  • -------------=====================
Visit my website -> Dr.seshagirirao-MBBS

మల్లాది వేంకట కృష్ణశర్మ , Malladi Venkata KrishnaSharma

మల్లాది వేంకట కృష్ణశర్మగారు 1907లో శ్రీకాకుళంలో జన్మించారు.. సుప్రసిద్ధ నాటకాలు, నాటికలూ చాలా రాసి, సినిమాల్లోకి ప్రవేశించారు. తొలి చిత్రం- అంజలి పిక్చర్స్‌ నిర్మించిన 'పరదేశి' (1953). అంజలి పిక్చర్స్‌వారు పూర్ణా మంగరాజుగారి ప్రోత్సాహంతో, చిత్ర నిర్మాణం ఆరంభించారు. అప్పటికి అంజలిదేవి- తెలుగు, తమిళం, హిందీ చిత్రాల ద్వారా ప్రసిద్ధి పొందారు. మంచి టెక్నీషియన్లతో మంచి సినిమా తియ్యాలని ఆలోచించి, హిందీలో వచ్చిన 'రాజా రాణి'ని కొన్నారు. దాన్ని డైరక్ట్‌ చెయ్యడానికి దర్శకుడిగా పేరు పొందిన ఎల్‌.వి.ప్రసాద్‌గారిని నియమించుకున్నారు. రెండు భాషల చిత్రం. 'రాజా - రాణి'ని తెలుగుకు వీలయ్యేలాగా రాసుకోవాలి. ప్రత్యేకంగా ఒక రచయితని పెట్టుకుంటే అనుకూలంగా ఉంటుందని, ఎవరనీ ఆలోచించారు. కృష్ణశర్మగారు రాసిన నాటకాల్లో అంతకుముందు అంజలిదేవిగారు, అంజనీకుమారి పేరుతో నటించారు. గనక, ఆ నాటకాలకి పేరూ వచ్చింది గనక, కృష్ణశర్మగారిని రచయితగా ఎన్నుకున్నారు. అలా జరిగింది- మల్లాది వెంకట కృష్ణశర్మగారి సినిమా రంగప్రవేశం.

కృష్ణశర్మగారిది పండిత వంశం. అందరూ సంస్కృతాంధ్రాల్లో గట్టివాళ్లు. కావ్యాలు, ప్రబంధాలూ క్షుణ్ణంగా అభ్యసించి, నాటక రచనలు చేసినవారు. ముఖ్యంగా శర్మగారి అన్నయ్య విశ్వనాథ కవిరాజుగారు హాస్యప్రియులు. పద్య నాటకాలు చాలా రాశారు. ప్రహసనాలు, నాటకాలూ సరేసరి! తన 15వ ఏటనే ఆయన 'లాక్షాగృహం' అనే ఏకాంకిక రాశారు. శ్రీకాకుళంలో తెలుగు ఉపాధ్యాయుడిగా తన 23వ ఏటనే ఉద్యోగంలో చేరారు. సురభి వారి నాటకాలు చూసి, చూసి వారితో పరిచయం ఏర్పరచుకుని- వారికి కొన్ని ప్రామాణిక నాటకాలు రాసి ఇచ్చారు. నాటకరంగం మీద ఎనలేని అనుభవంతో- పోలాని అనే గ్రామంలో నాటక కళాపరిషత్తు నడిపారు. శ్రీకాకుళంలో చట్టు పూర్ణయ్య పంతులు గారుండేవారు. ఆయన ప్రసిద్ధి రంగస్థల నటుడు. గిరీశం పాత్రని గొప్పగా అభినయించేశారని చెప్పుకోడం విన్నాను. ఆయన, విశ్వనాథ కవిరాజుగారూ కలిసి, ఆ పరిషత్తు నడిపారు. ఆంధ్రనాటక కళాపరిషత్తు వ్యవస్థాపకుల్లో కవిరాజు గారొకరు. ఆయన రాసిన హాస్య నాటకాలు ఎన్నో దొంగాటకం, డొంకలో షరాబు, గ్రీన్‌రూమ్‌, కిర్రు గానుగ వంటి నాటికలు బాగా ప్రదర్శితమయ్యేవి. ఐతే, ఆయన పూర్తిపేరు మల్లాది విశ్వనాథశర్మ. 'కవిరాజు' బిరుదు. ఆ బిరుదునే పేరుగా వాడుకున్నారాయన. 1936లో సినిమా రంగంలో ప్రవేశించి, 'భక్త మార్కండేయ (1938)', 'మాలతీ మధనం' (1940), 'పంతులమ్మ' (1943) 'సౌదామిని' (1951) మొదలైన చిత్రాలకు రచన చేశారు. భరణివారు తీసిన 'చక్రపాణి'కి కథకుడు ఆయనే.

కవిరాజుగారి తమ్ముడు కృష్ణశర్మగారు. కవిరాజుగారి పుత్రుడు మల్లాది అవధాని కూడా నాటకాలు, హాస్య నాటికలూ రాశారు. కృష్ణశర్మగారు 1907లో శ్రీకాకుళంలో జన్మించారు. మెట్రిక్యులేషన్‌ చదివి, కొంతకాలం కలెక్టరాఫీసులో గుమస్తా ఉద్యోగం చేసినా, నాటక రచనలు చేసి పేరు తెచ్చుకున్నారు. సురభివారు ప్రదర్శిస్తున్న మాయాబజార్‌, బాలనాగమ్మ, భూకైలాస్‌, దశావతారాలు, దక్షయజ్ఞం మొదలైన నాటకాలన్నీ శర్మగారి రచనలే! 'మిస్‌ ప్రేమ బి.ఎ.' నాటకం ఎంతో పేరు తెచ్చుకుంది. ఆంధ్రదేశంలోని చాలా పట్టణాల్లో ప్రదర్శితమైంది. వారసత్వం, ప్రత్యేక్ష దైవం, సుబ్బమ్మ విరహం, నామకరణం లాంటి హాస్య నాటికలు చాలా రశారాయన.

ఆర్‌.కె.రావు, శర్మగారూ మంచి స్నేహితులు. ఆ పరిచయం ఉండడం వల్ల, కృష్ణశర్మగారు 'పరదేశి'కి రాస్తున్నప్పుడు ఆయన దగ్గర (మద్రాసులో) రావికొండలరరావు సహాయకుడిగా చేరాను. 'పరదేశి' సంభాషణలు ఆయన చెబుతూ వుంటే ఇతను రాసేవాడు . 'పరదేశి' తర్వాత, ఆయన 'అన్నదాత' (1953), 'బంగారు భూమి' (1954), 'వద్దంటే డబ్బు' (1954), 'బీదల ఆస్తి' (1955) మొదలైన చిత్రాలకు మాటలు, కొన్ని పాటలూ రాశారు. హెచ్‌.ఎం.రెడ్డిగారు తన చిత్రాలను ముగ్గురు నలుగురు రచయితల చేత రాయించేవారు, శ్రీశ్రీ, కె.గోపాలరాయశర్మ వంటివారు రాసేవారు. కృష్ణశర్మగారు కూడా రాసేవారు. కొన్ని చిత్రాలకి హాస్య సన్నివేశాలు కల్పించడం, మాటలు రాయడం కూడా చేసేవారాయన. కొంత కాలం రాజరాజేశ్వరి కంపెనీలో కూడా కథాచర్చల్లో పాల్గొనేవారు. తర్వాత అనారోగ్యరీత్యా మద్రాసు వదిలి, సొంత ఊరు వెళ్లిపోయారు. తిరిగి వచ్చేసరికి సినిమాలు కుదరలేదు. మళ్లీ సురభి నాటక సంస్థకు వెళ్లిపోయి, వాళ్లకి నాటకాలు రాసి ఇచ్చారు. శర్మగారు మాటలు, పాటలు, పద్యాలూ అన్నీ రాసేవారు. కాని, విడిగా ఎవరూ చిత్రాల్లో పాటలు రాయించుకోలేదు.

శ్రీకాకుళంలో ఉన్నప్పుడు అక్కడ తిమ్మరాజు శివరాజుగారి 'మహోదయ' వారపత్రికకి శర్మగారు చిన్న చిన్న రాజకీయ ప్రహసనాలు రాసి ఇచ్చేవారు. ప్రెస్‌లోనే కూర్చొని, అక్కడికక్కడే ఆ ప్రహసనాలు రాసేవారు. అరగంట, గంటలో రాసి ఇవ్వడం చూసి అందరూ ఆశ్చర్యపోయేవారు. సినిమాలకు కూడా ఆయన దృశ్యాల్ని అంత తొందరగానూ రాసేవారు. ''హెచ్‌.ఎమ్‌. రెడ్డిగారి ఆఫీసులో కూర్చొని, పదిగంటలకి మొదలుపెట్టి, ఒంటిగంటకల్లా 32 సీన్లు రాశారు ''. ఐతే, మరి సినిమా రంగం ఎందుకు ఆయన్ని ఉపయోగించుకోలేకపోయిందో తెలియదు. తెల్లని ఖద్దరు జుబ్బా, పంచె కట్టుకుని వేళ్ల మధ్య సిగరెట్టు బిగించి, పొగ లాగుతూ, గలగలా నవ్వుతూ, నవ్విస్తూ వుండే కృష్ణశర్మగారు సురభి సంస్థలోనే వుంటూ అక్కడే జనవరి 19, 1973 నాడు మృతిచెందారు.

Source : Ravikondalarao Aanimutyaalu.

  • ====================================
Visit my website -> Dr.seshagirirao-MBBS