Tuesday, August 17, 2010

Veera Gunnamma , వీర గున్నమ్మ



వీర నారి గున్నమ్మ - బ్రిటిష్ ముష్కరుల చర్యలను ఓ సామాన్య మహిళ ఎదిరించినది . ధైర్యముగా ముందుకు కదిలింది . ఆంగ్లేయులతో పోరుకు సై అన్నది . కదనరంగం లో వారి తూటాలకు బలై వీర గున్నమ్మగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా మిగిలింది .
జిల్లాలో తొలి ఉద్యమ గ్రామము ' గుడరి రాజమణీపురము ' రైతులు పండించే పంటలో మూడో భాగాన్ని కప్పం (పన్ను) కింద ఆంగ్లేయులు చసూలు చేయడన్న్ని గ్రామప్రజలు మొట్టమొదటిగా ఎదుర్కొన్నారు . అటవీ ఉత్పత్తులను తెచ్చుకునేందుకు బ్రిటిష్ పోలీసులు అడ్డుకున్నారు . అటు పోఈసులకు , ఇటు రైతులకు మధ్య పోరాటానికి దారితీసింది . 1940 ఏప్రిల్ 01 న రాజపురం పొలిమేరల్లో బ్రిటిష్ పోలీసులకు , రైతులకు పోరాటము జరిగింది . యుక్త వయసు లో ఉన్న ' సాసుమాన గున్నమ్మ ' నీరనారిగా కదం తొక్కుతూ ముందుకు ఉరికింది . ఆమె పై పోలీసులు తుపాకీ కాల్పులు జరిపారు . తూటాలకు గురై నిండు చూలాలు గున్నమ్మ అక్కడికక్కడే మృతిచెందారు . ఆమె స్మారకార్ధము ఆ గ్రామానికి వీరగున్నమ్మపురం గా ఇటీవల నామకరణం చేసారు . గ్రామానికి వెళ్ళే ముఖద్వారము లో ఆమె పేరున సింహద్వారాన్ని ఏర్పాటు చేసారు . మృతిచెందిన చోట జ్ఞాపకార్ధము మసీదు నిర్మించారు . దీన్ని అప్పటి గవర్నర్ ' కుముద్ బెన్‌జోషి ' ప్రారంభించారు .
+

గున్నమ్మ 71వ వర్ధంతి .
జమిందారీ వ్యతిరేక ఉద్యమంలో రక్తబలిదానం చేసిన వీర వనిత గున్నమ్మ ఉద్దానం అడపడుచు. తెలుగింటి ఆడపడుచుల తెగువకు ప్రతిరూపంగా నిలిచిన వీరనారి సాసుమాను గున్నమ్మ. గున్నమ్మ 71వ వర్ధంతిని మండలంలో గురువారం నిర్వహించనున్నారు. వీరనారిగా చరిత్రలో స్ధానం పొందిన గున్నమ్మ గుడారి రాజమణిపురం గ్రామంలో సామాన్య రైతు కుటుంబంలో జన్మించింది. రెక్కాడితేగానీ డొక్కాడని దుర్భర జీవితంలో గున్నమ్మ పెరిగింది. నిండు గర్భవతిగా ఉన్న సమయంలో యుక్త వయసులోనే భర్త మాధవయ్యను భౌతికంగా కోల్పోయింది. అయినా గుండె నిబ్బరంతో జీవితాన్ని నెట్టుకొచ్చింది. చేదు అనుభవనాలు, జీవిత సవాళ్లను ఆమె ధైర్యంగా ఎదుర్కొంది. 1940 మార్చి 27,28లలో పలాసలో పెద్దఎత్తున నిర్వహించిన అఖిల భారత రైతు మహాసభలు జమీందారీ వ్యతిరేక ఉద్యమానికి కొత్త ఊపునిచ్చాయి. ఈ మహాసభ స్ఫూర్తితో నూతన ఉత్తేజాన్ని పొందుతూ 1940 మార్చి 29న ఎన్‌జి రంగా, టంగుటూరి ప్రకాశం పంతులు, సర్దార్‌ గౌతు లచ్చన్న, గానుగుల తరణిచారి, బెందాళం గవరయ్య, సర్దార్‌ మార్పు పద్మనాభం నాయకత్వంలో మందస ప్రాంతంలో ఉన్న గుడారి రాజమణిపురం మందస సంస్థానం కిసాన్‌ సభను రైతులు నిర్వహించారు. చుట్టుపక్కల గ్రామాల రైతులు, మహిళలు హాజరైన సభలో రైతు నాయకుడు మార్పు పద్మనాభం ఉద్వేగభరితంగా ఉపన్యసించారు. ఈ సభలో క్రియాశీలకంగా పాల్గొన్న గున్నమ్మ కూడా ప్రసంగించి రైతులను ఉత్తేజితులను చేసింది. ఈ సభ ఒక సాధారణ స్త్రీని వీరనారిగా తీర్చిదిద్దింది. మందస కొండల్లోని రుక్కమెట్ట అదుపు అడవికి వెళ్లి వంద ఎడ్ల బళ్లపై కలపను తీసుకురావడానికి రైతులు సిద్ధపడాలని గున్నమ్మ పిలుపునిచ్చింది. అడవిపై జమీందారులు విధించిన ఆంక్షలను చేధిస్తూ గున్నమ్మ నాయకత్వాన రైతులు కదిలి అడవిలో కలపను నరికి బళ్లపై ఎక్కించారు. విషయం తెలుసుకున్న మందస జమీందారు జగన్నాధ రాజమణి బెంబేలెత్తిపోయాడు. రైతులు తిరుగుబాటును అణచివేయాలని దివాను రామకృష్ణదేవ్‌ను, ఫారెస్ట్‌ రేంజర్‌ కృష్ణచంద్రరాజుకు హుకుం జారీ చేశాడు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన రైతులను, వారి ఎడ్ల బళ్లను ఆపేందుకు ప్రయత్నించారు. జిల్లా కలెక్టర్‌, ఎస్‌ఐకి, మెజిస్ట్రేట్‌లకు సమాచారం పంపించారు. అడవి నుంచి కలప తరలించడానికి వీల్లేదని ఫారెస్టర్‌ హుకుం జారీ చేసినా గున్నమ్మ నాయకత్వంలో రైతులు కలపను తీసుకుపోయారు. అనంతరం పూలదండలతో, పసుపు కుంకుమలతో ప్రజలు గున్నమ్మ నుదుట వీరతిలకం దిద్దారు. 1940 మార్చి 30న రాత్రి రాజమణిపురంలో అభినంద సభ ఏర్పాటుచేసి గున్నమ్మ ధైర్యసాహసాలను కిసాన్‌ నాయకులు ప్రశంసించారు.

అణచివేతకు పోలీసుల విఫలయత్నం

కలపను ఎడ్ల బళ్లపై తీసుకెళ్లడాన్ని ఇన్‌స్పెక్టర్‌ గోపి సుందర గంతాయత్‌ సహించలేక సోంపేట మెజిస్ట్రేట్‌ మద్దతుతో ఏప్రిల్‌ 1న పది మంది కానిస్టేబుళ్లను వెంట తీసుకొనివెళ్లాడు. ఉత్తరాన పొలంలో గుమిగూడివున్న ప్రజల్లోకి వెళ్లి కలపను స్వాధీనపర్చాలని గద్దించాడు. రైతుల ముఖాల్లోని ఉద్రిక్తత, వీరావేశం చూసి తోకముడిచి ఇంటిదారి పట్టాడు.

ప్రత్యక్ష పోరాటంలో వీర మరణం

ఈ పరిస్థితిని తెలుసుకున్న జమీందారు ఆందోళనతో అల్లాడిపోయాడు. జిల్లా ఎస్‌పి, సబ్‌కలెక్టర్‌, పోలీస్‌ సర్కిల్‌, సోంపేట మెజిస్ట్రేట్‌ తమ బలగాలతో వచ్చి రైఫిళ్లు, తుపాకులు చూపుతూ జనంలోకి ప్రవేశించారు. కదిలితే కాల్చివేస్తామని బెదిరించడంతో ఈటెలు, బల్లాలతో రైతులు యుద్ధానికి సిద్ధమయ్యారు. గూడెన నరసింహులు, గొర్లె దాలిబందు, గొర్లె జంగాలు, నెయ్యిల మంగళ, గొర్లె చంద్రయ్య, గొర్లె కర్రెన్నల చేతులకు బేడీలు వేసి పోలీసులు వ్యాన్‌లోకి ఎక్కించారు. పోలీసు శకటం కదలకుండా దానికి అడ్డంగా రైతులు పడుకున్నారు. ఈ దృశ్యాన్ని చూసిన గున్నమ్మ బేడీలు వేసి చెరలో పెట్టడానికి మీకెన్ని గుండెలురా అని గర్జించింది. శకటానికి అడ్డంగా నిలిచింది. గున్నమ్మ గుండెకు తుపాకులు గురిపెట్టి పక్కకు తప్పుకోవాలని పోలీసులు ఉన్నతాధికారులు హెచ్చరించినా గున్నమ్మ తప్పుకోలేదు. నా గొంతులో ప్రాణం ఉన్నంతవరకూ నా రైతులను బందీలుగా పోనివ్వనంటూ మరలా గర్జించడంతో ఓ పోలీసు ఆఫీసర్‌ రివాల్వర్‌ పైకెత్తాడు. గున్నమ్మలో ఏ మాత్రం చలనం లేకపోవడంతో పోలీసులను ఆశ్చర్యపరిచింది. ఒకవైపు మొండికేసిన ప్రజలు, మరోవైపు జమీందారు హుకుంతో రెచ్చిపోయిన పోలీసు అధికారులతో ఆ ప్రాంతం యుద్ధభూమిగా మారింది. కేకలు, అరుపులు, తుపాకీ శబ్ధాలు మిన్నుముట్టాయి. గున్నమ్మ పొట్టలోంచి తుపాకీ గుళ్లు దూసుకుపోయాయి. 1940 ఏప్రిల్‌ 1న సాయంత్రం 6.30 గంటలకు గున్నమ్మ వీరమరణం పొందింది. గున్నమ్మతోపాటు గుండ బుదియాదు, గొర్లె జగ్గయ్య, కర్రి కళియాడు, గుంట చిననారాయణ పోలీసుల కాల్పుల్లో మృతిచెంది జిల్లా రైతాంగ ఉద్యమాల చరిత్రలో సుస్థిర స్థానాన్ని పొందారు.
గున్నమ్మ అమరత్వాన్ని చాటిచెబుతూ గుడారి రాజమణిపురం నేడు గున్నమ్మనగర్‌గా మారింది. 1988 సెప్టెంబర్‌ 10న గున్నమ్మ పేరిట స్థూపాన్నిప్రభుత్వం నిర్మించింది. స్థూపాన్ని అప్పటి రాష్ట్ర గవర్నర్‌ కుముద్‌బెన్‌ జోషి ఆవిష్కరించారు. తెలుగింటి ఆడపడుచుల తెగువకు ప్రతిరూపంగా గున్నమ్మ చరితార్ధమైంది.


  • =================================
Visit my website -> Dr.seshagirirao-MBBS

C.R.M.Patnaik , సి.ఆర్.ఎం.పట్నాయక్



వంశధార ప్రాజెక్టు పితామహుడు సి.ఆర్.ఎం.పట్నాయక్ . 1968 లో వంశధార మొదటి దశ ప్రాజెక్ట్ కు డిజైన్‌ చేసి 1970 లో పూర్తిచేయడం తో ఆయన ఖ్యాతి నలుదిశలా వ్యాప్తి చెందినది . వంశధార రెండోదశ ప్రాజెక్టు నిర్మాణానికి నేరడి వద్ద బ్యారేజి నిర్మాణానికి ఈయనే డిజైన్‌ చేసారు . ఒరిస్సా ప్రభుత్వం అడుగడుగునా అభ్యంతరం చెబుతుండడం తో నేరడికి సమీపం లో సైడ్ వ్యూయర్ కట్టి ప్రాజెక్టు పూర్తిచేయవచ్చునని మరో డిజైన్‌ రూపొందించడం తో వై.రాజశేఖరరెడ్డి ప్రభుత్వము ఆ దిశగా చర్యలు చేపట్టినది . దీనిపై కూడా ఒరిస్సా ప్రభుత్వము సుప్రీం కోర్ట్ ను ఆశ్రయిండంతో పనులు ప్రారంభం కాలేదు . వంశధార మూడో దశ నిర్మాణము రాస్ట్ర వ్యాప్తం గా ఉన్న ఇంజినీర్లు ససేమిరా అనడంతో మరోసారి పట్నాయక్ నే ఆశ్రయించారు .

  • =================================================
Visit my website -> Dr.seshagirirao-MBBS

Kottapalli Punnayya , కొత్తపల్లి పున్నయ్య

కొత్తపల్లి పున్నయ్య న్యాయ రంగం తోపాటు రాజకీయం గా , కవిగా , వివిధ కమిటీల్లో కీలకం గా వ్యవహరించారు . 1923 ఆగస్టు 19 న సోపేట మండలం బారువలో జన్మించిన పున్నయ్య ఇచ్చాపురం , విజయనగరం ప్రాంతాల్లో విద్యాభ్యాసము చేసారు . క్విట్ ఇండియా జాతీయోద్యమం లో పాల్గొన్నారు . 1955 ఎన్నికల్లో చీపురుపల్లి నుంచి యునైటెడ్ కాంగ్రెస్ అభ్యర్ధిగా గెలుపొదినారు . అప్పట్లోనే జిల్లాపరిషత్ తొలి వైస్ -చైర్మన్‌ గా పనిచేసి విద్యారంగం అభివృద్ధికి కృషిచేసారు . 1962 లో పొందూరు నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు . చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయం లో కులవివక్షతను అంతమొందించడానికి పున్నయ్య కమిషన్‌ ఏర్పాటు చేసారు . భారత ప్రభుత్వము రాజ్యాంగ సమీక్షా సంఘం లో పున్నయ్య ను సభ్యుడి గా నియమించింది
  • =======================================
Visit my website -> Dr.seshagirirao-MBBS

Monday, August 16, 2010

కె.జె.రావు , K.J.Rao,కొమ్మాజోస్యుల జగన్నాధరావు


ప్రజాస్వామ్యానికి ఎన్నికలే ఆయువు పట్టు . అలాంటి ప్రక్రియలో రాజకీయ నాయకుల అనుచిత ప్రమేయము మొత్తం వ్యవస్థకే శపగ్రస్థం . ఇలాంటి అక్రమార్కుల పాలిట సింహస్వప్నం గా నిలిచిన ఘనత కె.జె.రావు గారిది . బీహార్ లాంటి ప్రమాదకర రాస్ట్రం లో ఎనికల ప్రక్రియను గాడిలో పెట్టిన ధీరుడాయన .

రేగిడి మండలం లోని కె.ఎం.వలస లో 1942 లో పుట్టి అంతర్జాతీయ స్థాయిలో జిల్లా వాణిని వినిపించిన తెలుగు తేజము కె.జె.రావు . ఉద్యోగి గా , రక్షణశాఖలో అడిటర్ గా , ఎన్నికల సంఘంలో చిరుద్యోగిగా ... అదే సంస్థలో కేంద్ర ఎన్నికల ప్రధాన సలహాదారుడు గా , అంతర్జాతీయ ఎన్నికల పరిశీలకుని గా , గల్ఫ్ దేశాలకు ఎంఫోర్సుమెంట్ అధికారిగా , ఐఎఎస్ , ఐపిఎస్ అధికారుల శిక్షణ సభ్యుడిగా , పలు రాస్ట్రాలలో ఎన్నికల పరిశీలకునిగా ... ఇలా అంచెలంచెలుగా ఎదిగి జిలా కీర్తిని ఇనుమడింప జేసిన ఘంత ఆయన సొంతం . ప్రస్తుతము ఫౌండేషన్‌ ఫర్ అడ్వాంస్డ్ మేనేజ్ మెంట్ ఫర్ ఎలక్షన్‌ (ఫేమ్‌) సంస్థకు ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు . సుఫ్రీం కోర్ట్ ఈయనను ఢిల్లీలో అక్రమ కట్టాడాల నియంత్రణ కమిటీ సభ్యునిగా ఇటేవల నియమించింది .



కొమ్మాజోస్యుల జగన్నాధరావు‎  శ్రీకాకుళం జిల్లా లోని కొండలమామిడివలస గ్రామంలో మార్చి 1 1942 న జన్మించారు. ఆయన స్వగ్రామంలో విద్యాభ్యాసం చేశారు. ఆయన విశాఖపట్టణం లోని ఎ.వి.ఎన్.కాలేజీ నందు 1959-62 లో "చరిత్ర" అంశంలో పట్టభద్రుడయ్యాడు.

ఈయన శ్రీకాకుళం జిల్లాలోని "జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మెట్టపల్లి" లో (ప్రస్తుతం ఈ పాఠశాల విజయనగరంలో కలదు) ఆగష్టు 1962 నుండి మార్చి 1963 వరకు అన్‌ట్రైన్డ్ ఉపాధ్యాయునిగా పనిచేశారు. ఆతర్వాత ఆయన మార్చి 1963 నుండి నవంబరు 1966 వరకు పూనే లోని డిఫెన్స్ ఆడిట్ డిపార్ట్ మెంటు లో ఆడిటరుగా పనిచేశారు.

1965 లో యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్ పరీక్ష ఉత్తీర్ణుడయిన తర్వాత ఆయన నవంబరు 14,1966 నుండి ఎలక్షన్ కమీషన్ ఆఫ్ ఇండియాలో సర్వీసులో చేరారు. ఎన్నికల కమిషన్ కార్యాలయంలో ఫిబ్రవరి 28,2002 వరకు ఆయన భారత ఎన్నికల కమీషన్ సెక్రటరీగా పదవీవిరమణ చేయువరకు అనేక బాద్యతలు నిర్వర్తించారు. మార్చి 1,2002 నుండి ఫిబ్రవరి 29,2004 వరకు ఆయన పదవి అనంతరం సేవలు కొనసాగించారు. తర్వాత ఆయన పరిశీలకులు(ఎన్నికలు మరియు శిక్షణ) గా 28 ఫిబ్రవరి, 2006 వరకు యున్నారు.

ఆయన అక్టోబరు 2002 లో జమ్మూ మరియు కాశ్మీర్ లో జరిగిన అతి క్లిష్టమైన సాధారన లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన రాష్ట్రంలోనే ఉండి ప్రతి దశలో ఎన్నికలను నిర్వహించారు. అతను రాష్ట్రంలో ఈ సాధారణ ఎన్నికల అన్ని విషయాలతో సంబంధం కలిగి సక్రమంగా నిర్వహించారు.ఈ ఎన్నికల్లో తన సహకారం భారతదేశం యొక్క ఎన్నికల కమిషన్ ద్వారా అందుకున్నాడు.

ఉద్యోగి గా , రక్షణశాఖలో అడిటర్ గా , ఎన్నికల సంఘంలో చిరుద్యోగిగా ... అదే సంస్థలో కేంద్ర ఎన్నికల ప్రధాన సలహాదారుడు గా , అంతర్జాతీయ ఎన్నికల పరిశీలకుని గా , గల్ఫ్ దేశాలకు ఎంఫోర్సుమెంట్ అధికారిగా , ఐఎఎస్ , ఐపిఎస్ అధికారుల శిక్షణ సభ్యుడిగా , పలు రాస్ట్రాలలో ఎన్నికల పరిశీలకునిగా ... ఇలా అంచెలంచెలుగా ఎదిగి జిలా కీర్తిని ఇనుమడింప జేసిన ఘంత ఆయన సొంతం . ప్రస్తుతము ఫౌండేషన్‌ ఫర్ అడ్వాంస్డ్ మేనేజ్ మెంట్ ఫర్ ఎలక్షన్‌ (ఫేమ్‌) సంస్థకు ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు . సుఫ్రీం కోర్ట్ ఈయనను ఢిల్లీలో అక్రమ కట్టాడాల నియంత్రణ కమిటీ సభ్యునిగా ఇటేవల నియమించింది .

కె.జె.రావు రాజీవ్ గాంdhi 1989 లో పోటీ చేసిన అమేధీ నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల అవకతవకలపై యేర్పడిన పరిశీలనా కమిటీలో సభ్యులుగా యున్నారు. 2002 లో ఆయన పదవీవిరమణ చేసినప్పటికీ భారత ఎన్నికల కమిషన్ కు అనేక విధాలుగా సేవలందిస్తున్నారు. ఈయన పశ్చిమ బెంగాల్ లో ఎన్నికల జాబితాలలో బోగస్ ఓట్లు తొలగించే కార్యక్రమంలో సహకారమందించారు.2009 లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై వచ్చిన అభియోగాలను ఖండించాడు.

  • courtesy with wikipedia.org

  • ========================================
Visit my website -> Dr.seshagirirao-MBBS

Saturday, August 7, 2010

ఆనంద్ - జి ,Anandh.G(singer)

అభిమాని అమ్మాయికి ఆటోగ్రాఫ్ ఇస్తున్న .. ఆనంద్ - జి

పరిచయం :
  • నవతరం స్వర మాధురి సంస్థ తో వర్ధమాన , ఔత్సాహిక గాయనీ , గాయకులకు ప్రదర్శనావకాశాలు కల్పిస్తున్న సినీ నేపద్య గాయకుడు ... జి.ఆనంద్ . ఈయన శ్రీకాకుళం జిల్లాకు చెందినవారు . పుట్టిన జిల్లా ప్రేమతో జిల్లాలో జరిగిన అనేక సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతూ ఉంటారు . అమెరికాలో 14 ప్రదర్శనలు ఇచ్చారు . సుమారు 2,500 పాతలు పాడినారు . 150 ఆల్బమ్‌సు చేసినారు . సినిమా చాన్‌సులు లేకపోయిన .. డబ్బింగు ఆర్టిస్టు గాను , అనేక టి.వి. సీరియల్స్ లో సంగీత దర్శకుడుగా రాణిస్తునారు .
  • పండంటి కాపురం సినీమా తో గాయకుడి గా సినీ రంగ ప్రవేశం చేసిన ఆనంద్ సంగీత దర్శకుడు కుడా . స్వరమాధురిఫౌండేషన్ వ్యవస్థాపకుడైన ఈయన ఎంతో మందిని సినీ , దూరదర్శన్ రంగాలకు పరిచయం చేశారు . షిరిడి సాయిబాబా, తిరుపతి బాలాజీ, విష్ణుపురాణం , గాంధర్వ మాలతీయం వంటి సీరియల్ కి సంగీతం అందిస్తున్నారు . ఎన్నో భక్తీ పాటల అల్బుమ్స్ చేస్తున్నారు .
ప్రొఫైల్ :
  • పేరు : ఆనంద్ , గేదెల (జి),
  • సొంత ఊరు : తులగం గ్రామము - హిరమండలం దరి ., శ్రీకాకుళం జిల్లా .
  • సోదరుడు : బాలరాజు (మాస్టారు) రాగోలు (ఆర్.టి.సి.కాలనీ-శ్రీకాకుళం జిల్లా ),
ఫిల్మోగ్రఫీ : పాటలు పాడిన కొన్ని సినిమాలు >
  • పండంటి కాపురం ,
  • అమెరిక అమ్మాయి ,
  • దిక్కులు చూడకు రామయ్యా అనే పాట ,
  • విటలా ... విటలా ... పాండురంగ విట్టలా అనే పాట ,
కొన్ని ఆల్బం లు :
  • 1.హోసంన్డ దేవుడు ఫ్రొం ఆల్బం జీసస్ సవెస్ (కరుణామయుడు, రాజాధిరాజు, మేరీ మత అండ్ బాల యేసు) (తెలుగు) 36
  • 2.ప్రభు యేసుని ఫ్రొం ఆల్బం (తెలుగు) 15
  • 3.నన్ను మరువలేదు ఫ్రొం ఆల్బం ప్రైస్ ది లోర్డ్ (తెలుగు) 8
  • 4.యేసు విభుని ఫ్రొం ఆల్బం ప్రైస్ ది లోర్డ్ (తెలుగు) 7
  • 5. మానస మానస ఫ్రొం ఆల్బం (తెలుగు) 4
  • 6.సమానులేవారు ప్రభో ఫ్రొం ఆల్బం (తెలుగు) 3
  • 7.సీతాపతి నీకు ఫ్రొం ఆల్బం దొంగలకు దొంగ (ట్ల్గ్) (తెలుగు) 2
  • 8.మాడు తండ్రి దేవ ఫ్రొం ఆల్బం (తెలుగు) 1
  • 9.ప్రభు వాక్యమున్ ఫ్రొం ఆల్బం (తెలుగు) 0
  • 10.స్తోత్రించుము మానస ఫ్రొం ఆల్బం (తెలుగు) 0
  • 11.హృదయమనేడు
  • 12.రాగము తలములో

  • ==============================================
visiti my website > Dr.Seshagirirao-MBBS.

Nandikeswararao Lokanadham , నందికేస్వరరావు లోకనాధం


--

ప్రతి మనిసిలో ఎదోఒక కళ ఉంటుంది , సాధన , కౄషిల సమన్వయము తో రాణిస్తారు . నందికేశ్వరరావు శ్రీకాకుళం పట్నానికి చెందిన మిమిక్రీ కళాకారుడు . మిమిక్రీ తో విభిన్న ధ్యనులను పలికించి సమ్మోహన పరిచే మాంత్రికుడు గా , అహూతులను అలరించే వినోధ సృస్టికర్తగా పేరు గాంచారు . శ్రీకాకుళం లో పుట్టి పెరిగి మిత్రులు , గురువులు సాయం తో సాధన చేసి అంతర్జాతీయ స్థాయిలో వేలాది ప్రదర్శనలిచ్చి ఎన్నో సత్కారాలు పొందేరు .

రచయితగా , నటుడిగా , చిత్రకళోపాధ్యాయునిగా , పసిద్ధ ధ్వనుఅనుకరణ కళాకారునిగా పేరుపొందిన నందికేశ్వరరావు డా.నేరెళ్ళ స్పూర్తితో స్వరమాంత్రికుడి ఏకలవ్య శిష్యునిగా పదిహేనేళ్ళ ప్రాయం లోనే ధ్వనులను అనుకరించడం ప్రారంభించారు . పాతశ్రీకాకుళం లోని తన ఇంటిదరిలోచెట్లపై పొద్దున్నే కిలకిల రావాలు చేసే పక్షుల ధ్వనులను పరిశీలించేవారు . నిరంతర సాధన కృషితో మిమిక్రీ కళాకారునిగా పేరు పొంది ఎందరో శిష్యులను తయారుచేశారు . మిమిక్రీ శ్రీనివాస్ , సూర్యారావు తో పాటు విశాఖపట్నం లోను , ఇతర జిల్లాలలోను ఆయన శిష్యులున్నారు .

అవార్డులు :
  • ఉత్తమ మిమిక్రీ కళాకారునిగా ఎనిమిది సార్లు పురస్కారాలు ,
  • రాష్ట్ర స్థాయిలో మూడు బంగారు పతకాలు పొందేరు ,
  • జిల్లా సాక్షరత సమితి శిబిరం లో సత్కారాలు ,
  • గుజరాత్ లొ జరిగిన నెహ్రూ యువకేంద్రం శిక్షణ శిబిరం లో పురస్కారాలు పొందినారు ,
  • ఎం.టి.అర్ , అక్కినేని , చిరంజీవి , అల్లు రామలింగయ్య , సుత్తివేలు , కోటా శ్రీనివాసరావు , బ్రహ్మానందం , వంటి స్నినీ ప్రముఖుల చేతులమీదుగా సత్కారాలు అందుకున్నారు .
  • మర్రి చెన్నారెడ్డి , పి.వి.నరసింహారావు , జె.వెంగళరావు , చంద్రబాబునాయుడు వంటి రాజకీయ ప్రముఖులు సత్కరించారు .
  • ఉత్తమ ఉపాధ్యాయుని గా ప్రభుత్వము సత్కరించినది .

(మూలము : ఈనాడు దినపత్రిక )
  • =======================================
Visit my website -> Dr.seshagirirao-MBBS