Wednesday, July 28, 2010

Eeranki Venkataramana , ఈరంకి వెంకటరమణ


--

ఈరంకి వెంకటరమణ రిటైర్ అయిన చిత్రలేఖన ఉపాధ్యాయుడు . శ్రీకాకుళం పట్టణం లో గుడివీధి నివాసము . భార్య శేషమ్మ . చిత్రలేఖనం లో ఎన్నో అద్భుతాలు సృస్టించారు .

సమాజాన్ని ఆలోచింపజేసే కళల్లో చిత్రలేఖనం ఒకటి , ఇది దేవతా విధ్యలైన 64 కళలలో ఒకటి .. ఆ విధ్యలో రాణించడం ఓ విలక్షణ , విశిస్టత . అంకితభావము తో పనిచేస్తే అద్భుతాలు సృస్టించవచ్చు .

వెంకటరమణ 2002 లో పదవీ విరమణ పొదిననాటి నుండి అదే పనిగా ఎన్నో చిత్రాలు వేస్తున్నారు . చిత్రలేఖనానికి , శిల్పాల తయారీకి తన ఇంట్లో ప్రత్యేక గదులు ఏర్పరిచేరు . ఆసక్తి గల విధ్యార్దులకు చిత్రలేఖనం లొ మెలకువలు నేర్పిస్తూ ఉన్నారు . ఉత్తం ఉపాధ్యాయునిగా , అక్షరక్రాంతి , జన్మభూమి ప్రోత్సాహకునిగా , చిత్రలేఖన శిక్షకునిగా ఆయన సేవలు శ్లాఘనీయము , శ్రీకాకులం జిల్లలో నేటికి చిత్ర , కళా , నాటక రంగానికి అలుపెరగని యోధునిగా అవిశ్రాంతము గా సేవలు అందిస్తూ అతి సామాన్య జీవితం గడుపుతున్నారు .

అవార్డులు :
  • రాస్ట్ర ఉత్తమ చిత్రలేఖన ఉపాధ్యాయునిగా 2002 లో అప్పటి ముఖ్యమంత్రి రానా చంద్రబాబునాయుడు చేతుల మీదుగా రవీంద్రభారతిలో అవార్డునందుకున్నారు .
  • 2001 - 2002 ఉత్తమ ఉపాధ్యాయునిగాజిల్లా అవార్డు ఎంపికై కలెక్టర్ , జిల్లా విధ్యాశాఖ అధికారి చేతులు మీధుగా సన్మానము , ప్రశంసాపత్రము పొందినారు .
  • శ్రీకాకులం జిల్లా సాక్షరతా సమితి ' అక్షర క్రాంతి ' సంపాదకీయునిగా ఉత్తం సేవలందించిన సందర్భముగా కలెక్టర్ పునీఠా ద్వారా సత్కారము .
  • ఉత్తం కళాకారునిగా సాహితీ మిత్ర మండలి నుంచి 2003 లో పురష్కారము ,
  • ఘంటశాల చిత్రాన్ని పోస్టల్ స్టాంపు గా డిజైన్‌ రూపొందించినందుకు 2003 లో రాస్ట్ర తపలాశాఖ వారి నుంచి ప్రశంసాప్రత్రము , నగదు బహుమతి పొందినారు .

మూలము : ఈనాడు దినపత్రిక ... శ్రీకాకుళం ఎడిషన్‌.
  • ==============================================
Visit my website -> Dr.seshagirirao-MBBS

Monday, July 26, 2010

Yakobu Kalaga(Sailor) , కలగ యాకోబు(సెయిలిరగ్)




సెయిలిరగ్‌లో తెలుగు కెరటం.

2006 విశాఖలో ఆసియా సెయిలింగ్‌ క్రీడల సెలెక్షన్స్‌... వివరీతమైన గాలులు! పోటీ కోసం పెళ్లిన పాళ్లు చాలామంది పెనక్కి వచ్చేస్తున్నారు.గాలి పేగం 36 నాట్స్‌ దాటింది. ఈ వరిస్థితుల్లో సెయిలింగ్‌ చేయడం చాలా వ్రమాదం! అందరికి పెనక్కి వచ్చేయమని సంకేతం! కానీ సగం దూరం పెళ్లిన అతను మాత్రం ఈ గాలిని లెక్క చేయలేదు. రేసును వూర్తి చేసేదాకా వదల్లేదు. కానీ మరో నిమిషంలో ఒడ్డును చేరుకుంటాడనగా ఒక్కసారిగా అలలు అతన్ని కప్మేుశాయి. వడవను నియంత్రిరచే తాడు అతని పెుడకు చుట్టుకుంది. చనిపోయానేపెూ అని అతను అనుకున్నాడు. అయినా ఎట్టకేలకు అతను ఒడ్డును చేరి అందరి చేత శభాష్‌ అనిపించుకున్నాడు. ఈ ఒక్క సంఘటన చాలు అతనిలో వట్టుదలను చెవ్పడానికి. ఈ వట్టుదలతోనే అతను సెయిలింగ్‌లో సత్తా చూవిస్తున్నాడు. అతనే శ్రీకాకుళానికి చెందిన కలగ యాకోబు. హుస్సేన్‌సాగర్‌లో జరుగుతున్న జాతీయ సెయిలింగ్‌ ఛాంఫియన్‌షివ్‌లో యాకోబ్‌ హోబి 16 క్లాస్‌ విభాగంలో రాజీప్‌తో కలిసి రజతం సాధిరచి సత్తా చాటాడు. బోటులో హెల్మ్‌ (కెవ్టెన్‌) స్థానంలో ఉండి విజయంలో కీలకపాత్ర పోషించాడు.
మత్స్యకారుల కుటుంబర నుంచి...
శ్రీకాకుళం జిల్లా వలాసకు చెందిన యాకోబుకు చిన్నవ్పటి నుంచి చేవలు వట్టడం, ఈతకు పెళ్లడం సరదా. తల్లిదండ్రులు అన్నమ్మ, కామయ్యలుమత్స్యకారులు కావడంతో అతనికి సముద్రపేు ఆట స్థలమైనది. వ్రతికూల వరిస్థితుల్లోనూ జడవక ముందుకు సాగడం యాకోబుకు అలపాటు. ఈ ధైర్యపేు అతనికి ఆర్మీలో ఉద్యోగం సంపాదిరచివెట్టింది. 1995లో హైదరాబాద్‌లోని ఆర్టిలరీ సెంటర్‌కు వచ్చిన యాకోబుకు తొలిసారి పాటర్‌ స్పోర్ట్స్‌ అంటే ఏంటో తెలిసింది. 2002 నుంచి హుస్సేన్‌ సాగర్‌లో యాకోబు ప్రాక్టీస్‌ చేసేపాడు. 2008లో చెన్నైలో జరిగిన జాతీయ హోబి ఛాంవియన్‌షివ్‌లో యాకోబు... సంజీప్‌తో కలిసి స్వర్ణర గెలిచి అందరి దృష్టిలో వడ్డాడు. 2009లో చెన్నైలో 420 క్లాస్‌లో గిరీశంతో కలిసి కాంస్యం సాధించాడు. 2010లో చెన్నైలో జరిగిన 420 క్లాస్‌ పోటీల్లో మరోసారి రాజీప్‌తో కలిసి స్వర్ణం సాధించాడు. ఐతే యాకోబ్‌ కెరీర్‌లో గుర్తుండిపోయే విజయం ఖతార్‌లోని దోహాలో జరిగిన సెయిల్‌ ద గల్ఫ్‌ ఛాంవియన్‌షివ్‌. 2010లో జరిగిన ఈ పోటీల్లో అతను రాజీప్‌తో కలిసి రజతం గెలిచాడు. ''అమ్మానాన్నలు చేవలు వడతారు. ఆ స్థితి నుంచి వచ్చి జాతీయ స్థాయిలో వతకాలు సాధించడం చాలా గొవ్పగా అనివిస్తోంది. స్వస్థలం శ్రీకాకుళర అయినా వ్రస్తుతం ఒరిస్సాలోని బరంవురంలో ఉంటున్నాడు . అమ్మానాన్నలతో పాటు అన్నయ్య ప్రోత్సాహరం వల్లే ఈ స్థాయికి ఎదిగా. కోచ్‌లు పెూరె, గిరీష్‌లు నన్ను తీర్చిదిద్దారు. హోబి క్లాస్‌లో కెవ్టెన్‌గా వడవకు దిశానిర్దేశం చేయాలి. ఖతార్‌లో రజతం గెలవడాన్ని ఎవ్పటికి మరిచిపోను. ఈ ఛాంవియన్‌షివ్‌లో కేవలం మూడే పాయింట్ల తేడాతో స్వర్ణం కోల్పోయాడు . 2002 జాతీయ క్రీడలవ్పుడు శావ్‌ ఇచ్చిన బోట్లు మావి. కానీ మా వ్రత్యర్థులు కొత్త బోట్లతో బరిలో దిగారు. పాత బోట్లతో వేగంగా దూసుకెళ్లడం కష్టమైనది. మంచి బోట్లు ఉంటే కచ్చితంగా మరింత పెురుగ్గా రాణిస్తా'' అని యాకోబు ధీమాగా చెప్పాడు.

మూలము : ఈనాడు దినపత్రిక .
  • ======================================
Visit my website -> Dr.seshagirirao-MBBS

Wednesday, July 14, 2010

స్వామిబాబు పొట్నూరు , Swaami Babu Potnuru




స్వామిబాబు పొట్నూరు నరసన్నపేట వాస్తవ్యులు . దేషభక్తుడు , దాత , సంఘసేవకుడు , కవి , పండితపోషకుడు .
  • పుట్తిన సం : 1884 ,
  • మరణము : 1982 ,
చేసిన సేవలు :
  • దేశభక్తుడు గా : 1906 వందేమాతరం ఉద్యమము లొ సకుటుంబము గా పాల్గొన్నారు . స్వరాజ్యోధ్యమం , ఉప్పుసత్యాగ్రహం , క్విట్ ఇండియా ఉధ్యమాలలో క్రియాశీల పాత్రలు పోషించారు , 1941-42 ఉమ్మడి విశాఖ జిల్లాబోర్డు అధ్యక్షుడు గా , ఖాదీ ఉధ్యమవ్యాప్తికి ఎనలేని కృషిచేసారు . .

  • సంఘసంస్కర్త : స్త్రీ విద్య , ఆదర్శ వితంతు వివాహములు , అస్పుష్యతానివారణ కోసం కృషిచేసారు .,

  • సంఘ సేవకుడు : దళితులకు గ్రామసముదాయ నిర్మాణము , సహకారరంగ విస్తరణకు తోడ్పదినారు ,

  • దాత గా : కవులకు ఇల్లు , శిశు సదనాలు , ఆశ్రమాలు , ఆసుపత్రుల నిర్మాణములు గావించారు .
అట్టి మాహాపురుషుని విగ్రహాన్ని ఇంటాక్ సహకారము తో డే & నైట్ కొత్త బ్రిడ్జి రోడ్ న ఆవిష్కరించారు .

  • ====================================
Visit my website -> Dr.seshagirirao-MBBS

Tuesday, July 6, 2010

Kurmapu Narasimham , కూర్మాపు నరసింహం





కూర్మాపు నరసింహం మంచి చిత్రకారుడు . కుంచె తో కోటి భావాలు పలికించగల మహా వ్యక్తి . వర్ణ చిత్రాలతో శ్రీకాకుళం జిల్లా కీర్తిని జాతీయ స్థాయిలో ఇనుమడిమ్పజేసిన విశిష్ట ప్రతిభా వంతుడు .

శ్రీకాకుళం పట్నం లో చిన్నబజారు లో ఉన్న నాగేశ్వరరావు ఫోటో స్టుడియోలో ఎన్నో చిత్ర కళా ఖండాలు ఆయన వేసినవే . శ్రీశైలం భ్రమరాంబికాలయం లో నరసింహం గీసిన " ఛత్రపతి శివాజీ కి వీరఖడ్గం అందిస్తున్న బ్రమరంభికాదేవి " చిత్రపటాన్ని తిలకించిన అప్పటి ప్రధాని ' జవహర్ లాల్ నెహ్రూ ' ఈ చిత్ర కారుదుని నేను చూడాలని ఉంది అన్నారంటే నరసింహం భావం ఎంత ఉన్నతమైనదో అవగతము కాగలదు . మల్లెపువుల్లాంటి నేత చీరల్లో అంతుపట్టని హావభావాలతో రంగుదాల్చిన ముగద మనోహరిని ' సుందరమూ గా చిత్రీకరించారు .
మహాత్ముడు దూసి గ్రామానికి వచ్చినప్పుడు గాంధీజీ నిలువెత్తు చిత్రాన్ని గీసి ఇచ్చి ఆయన ప్రశంసలు పొందేరు . కూర్మాపు చిత్రించిన " బుద్దుని క్షీరనివేదనమ్ " బొమ్మను జపాన్ బౌద్ధ అధ్యయన బృందము చూసి ప్రశంసించి నరసింహం చిత్రపటానికి సాష్టాంగ నమస్కారము చేసారు .

జీవిత విసేసాలు :
  • పేరు : కూర్మాపు నరసింహం ,
  • ఊరు : గుల్ల సీతారాంపురము -- సంతకవిటి మండలము .
  • మరణము : 28 - సెప్టెంబర్ 1968 .
  • సోదరుడు : కూర్మాపు బుచ్చిబాబు ,

సేకరణ : డా. వందనా శేషగిరిరావు - శ్రీకాకుళం
  • ============================================
Visit my website -> Dr.seshagirirao-MBBS

Monday, July 5, 2010

‌ గ్రంధి మల్లిఖార్జునరావు , Grandhi MallikharjunaRao





పారిశ్రామికవేత్తగా అవతరించిన మెకానికల్ ఇంజినీర్‌ జిఎంఆర్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ గ్రంధి మల్లిఖార్జునరావు (59) 4.3 బిలియన్‌ డాలర్ల నికర సంపత్తితో జాబితాలో 13వ స్థానాన్ని సంపాదించుకున్నారు.

దేశంలోని వందమంది సంపన్నుల్లో ఏడుగురు తెలుగువారే. ఫోర్బ్స్‌ పత్రిక విడుదల చేసిన అపరకుబేరుల జాబితా ఈ విషయాన్ని వెల్లడించింది. ముఖేష్ అంబానీ, అజీమ్‌ ప్రేమ్‌జీ, లక్ష్మీమిట్టల్‌ సరసన స్థానం సంపాదించిన తెలుగువారిలో జీఎంఆర్‌ గ్రూప్‌ వ్యవస్థాపకులు గ్రంధి మల్లిఖార్జునరావు, ల్యాంకో గ్రూప్‌ అధిపతి లగడపాటి మధుసూధనరావు ఉన్నారు. జీవీకే గ్రూప్‌ సారధి గనుగుపాటి వెంకట కృష్ణారెడ్డి, దివిల్యాబ్స్‌ వ్యవస్థాపకుడు మురళి దివి, రెడ్డి ల్యాబ్స్‌ చైర్మన్‌ కల్లం అంజిరెడ్డిలకూ ఫోర్బ్స్‌ జాబితాలో చోటు దక్కింది. అపోలో హస్పిటల్స్‌ ఫౌండర్‌ ప్రతాప్‌రెడ్డి, అరబిందోఫార్మా అధినేత పీవీ రామ్‌ప్రసాద్‌రెడ్డి పేర్లు కూడా ఈజాబితాలో చేరాయి.
  • పేరు : గ్రంధి మల్లికార్జున రావు
  • చదువు : మెకానికల్ ఇంజినీర్ .
  • జననం : జూలై 14,1950,
  • పుట్టిన ఉరు : రాజాం , శ్రీకాకుళం జిల్లా ,
  • భార్య : వరలక్ష్మి ,
  • పిల్లలు : కుమార్తె - సరిత , అల్లుడు -ప్రశాంత్ బాబు ,
  • తమ్ముడు : గ్రంధి ఈశ్వరరావు ,మరదలు -సరస్వతి ,
  • నివాసం : బెంగళూరు, భారత దేశం
  • వృత్తి : వ్యాపారవేత్త

గ్రంధి మల్లికార్జున రావు లేదా జి.ఎమ్‌.ఆర్. ఒక ప్రముఖ వ్యాపారవేత్త. ఇతను జి.ఎమ్.ఆర్.గ్రూపు అనబడే వ్యాపార సంస్థల సముదాయానికి అధినేత. జి.ఎమ్.ఆర్. వ్యాపార సంస్థలు రోడ్లు, విద్యుత్తు, విమానాశ్రయాలు వంటి మౌలిక సదుపాయాలకు సంబంధించిన వ్యాపారాలలో దేశంలో ఒక ముఖ్య స్థానాన్ని సాధించాయి.. ఇతను 2007 సంవత్ససరం ప్రపంచంలో ధనికుల జాబితాలో 349వ స్థానంలో ఉన్నాడు. ఇతని ఆస్తి 2.6 బిలియన్ డాలర్లగా అంచనా వేశారు.ఫోర్బ్స్ భారత దేశంలో ధనికుల జాబితాలో ఇతను 13వ స్థానంలో ఉన్నాడు.

జీవితం

గ్రంధి మల్లికార్జునరావు జన్మస్థలం శ్రీకాకుళం జిల్లా రాజాం. ఇద్దరు కుమారులు ఒక కుమార్తె ఉన్నారు.


వ్యాపార ప్రస్థానం

మల్లికార్జునరావు 1974లో ఇంజనీరింగ్ పూర్తయిన వెంటనే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ వర్క్స్ విభాగంలో చేరాడు. 1976 ఇలా చిన్న ఉద్యోగస్తులు ఎక్కువ డబ్బు సంపాదించలేరని కుటుంబ రీత్యా వస్తున్న జూట్ మిల్లులలో వ్యాపారానికి ఉపక్రమించాడు. చెన్నైలో ఒక పాత జూట్ మిల్లుకొని దానిని పార్టు పార్టులుగా రాజాం తరలించి అక్కడ "వాసవి మిల్స్" అనే ఒక మిల్లును మొదలుపెట్టాడు. 1978లో వరలక్ష్మి మిల్స్ అనే మరొక జూట్ మిల్లును ప్రారంభించాడు. 1983లో ఫెర్రో అల్లాయ్స్ కర్మాగారాన్ని నిర్మించాడు. అప్పుడే "జి.ఎమ్.ఆర్. టెక్నాలజీస్ & ఇండస్ట్రీస్" ప్రాంభమయ్యింది.

1984-85 ప్రాంతంలో వైశ్యా బ్యాంకులో పెట్టుబడులు పెట్టసాగాడు. తన మిత్రుడైన రమేష్ గెల్లి ప్రోద్బలంతో వైశ్యాబ్యాంకు బోర్డు సభ్యుడయ్యాడు. 1991-982లో వైశ్యాబ్యాంకు హక్కుదారుల షేర్లను పెద్దమొత్తంలో కొని ఆ బ్యాంకుకు అతిపెద్ద వాటాదారుడయ్యాడు. 1994లో బ్యాంకునుండి రమేష్ గెల్లి నిష్క్రమించినపుడు మల్లికార్జునరావు తన కార్యకలాపాలను బెంగళూరు, శ్రీకాకుళం - రెండు చోట్లనుండీ నడుపుకోవాల్సివచ్చింది. 1995లో ఒక చక్కెర మిల్లు లైసెన్సు పొంది, దానితోపాటు 16 మెగావాట్ల కో-జెనరేషన్ విద్యుత్‌కర్మాగారాన్ని శ్రీకాకుళంలోని సంకిలి గ్రామము వద్ద మొదలుపెట్టాడు. 1996లో మద్రాసు వద్ద బేసిన్‌బ్రిడ్జి డీసెల్ విద్యుత్కేంద్రం కంట్రాక్టు పొందాడు. 1996-97లో బెంగళూరుకు మారాడు. 1998లో మంగళూరు వద్ద తనీర్ భావి పవర్ ప్రాజెక్టు మొదలయ్యింది. 1998లో మొదలు పెట్టిన బ్రూవరీ బిజినెస్ 2001లో విజయ్ మాల్యాకు చెందిన యు.బి. గ్రూప్‌కు 53 కోట్లకు అమ్మివేశారు.


2002లో తమిళనాడులో ఒకటి, ఆంధ్రప్రదేశ్‌లో ఒకటి జాతీయ రహదారుల ప్రాజెక్టులు చేజిక్కించుకొన్నారు. 2003లో హైదరాబాదు అంతర్జాతీయ విమానాశ్రయం వారికి చిక్కింది. 2003లో తన వైశ్యాబ్యాంకు షేర్లను 560 కోట్లకు అమ్మేశాడు. అలాగే 2003లో మొదలుపెట్టిన ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీని 13కోట్ల లాభానికి అమ్మేశాడు. 204లో వేమగిరి విద్యుత్‌కర్మాగారం పని మొదలయ్యింది. ఇది ఈ సంస్థయొక్క మూడవ విద్యుదుత్పాదక కేంద్రం.

2006లో భారత దేశంలో రెండవ పెద్ద విమానాశ్రయం అయిన ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రైవేటీకరణకు కంట్రాక్టును సాధించి జి.ఎమ్.ఆర్. సంస్థ దేశంలో గుర్తింపు పొందింది.. ఈ కాంట్రాక్టు సాధించడానికి తగిన అర్హత కోసం Fraport AG అనే అంతర్జాతీయ సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవడానికి 500 మిలియన్ డాలర్లు వెచ్చించారని అంచనా. ఇదే సంస్థ నిర్మించిన హైదరాబాదు అంతర్జాతీయ విమానాశ్రయం 2008లో ప్రారంభం అయ్యింది.


Grandhi is one of the Richest persons in the world - 2011

  • ==================================================
Visit my website -> Dr.seshagirirao-MBBS