Friday, June 11, 2010

ఉమామహేశ్వరరావు బాక్షర్ , Umamaheswararao Boxer



శ్రీకాకుళం పట్టణానికి చెందిన మాణిక్యం ఉమామహేశ్వరరావు ఒకప్పుడు బాక్సింగ్‌ రింగ్‌లోకి దిగి తన బలమైన పంచ్‌ విసిరితే ఎంతటి ప్రత్యర్థయినా చిత్తు కావల్సిందే. అలాంటి బాక్సర్‌ ఆర్థిక పరిస్థితి బాగోలేక, ఎటు నుంచీ సహాయం అందక.. నేడు ఆటో నడుపుతూ కుటుంబ సాగరాన్ని ఈదుకొస్తున్నాడు. తొమ్మిదో తరగతి వరకు చదువుకున్న ఉమామహేశ్వరరావు కుటుంబ ఆర్థిక పరిస్థితులు చదువుకు మధ్యలోనే స్వస్తిపలికాడు. చిన్నప్పటి నుంచి మార్షల్‌ ఆర్ట్స్‌పై మక్కువ పెంచుకున్న ఆయన 1989లో స్థానిక భీమేశ్వర బాక్సింగ్‌ క్లబ్‌లో సభ్యుడిగా చేరి జిల్లా బాక్సింగ్‌ అసోసియేషన్‌ కార్యదర్శి బలగ లక్ష్మణదేవ్‌ వద్ద బాక్సింగ్‌ క్రీడలో శిక్షణకు ఓనామాలు దిద్దాడు. అనతికాలంలోనే ఆ క్రీడలో మెలకువలను ఆవలింపు చేసుకొని పలుస్థాయి పోటీల్లో పాల్గొని రాణించాడు.

ప్రతిభకు గుర్తింపు..
* 1990లో వరంగల్‌లో జరిగిన రాష్ట్రస్థాయి బాక్సింగ్‌ పోటీల్లో తొలిసారిగా పాల్గొని ఫెదర్‌ వెయిట్‌ విభాగంలో కాంస్య పతకం కైవసం చేసుకున్నాడు.
* 1991లో విశాఖలో జరిగిన రాష్ట్రస్థాయి బాక్సింగ్‌ పోటీల్లో ఫెదర్‌ వెయిట్‌ విభాగంలో పాల్గొని రజతపతకం. అదే ఏడాది సికింద్రాబాద్‌లో జరిగిన రాష్ట్రస్థాయి పోటీలకు ప్రాతినిధ్యం. విశాఖపట్నంలో జరిగిన భారతరత్న రాజీవ్‌గాంధీ మెమోరియల్‌ స్పోర్ట్స్‌ ఫెస్టివల్‌లో ఫెదర్‌ వెయిట్‌ విభాగంలో స్వర్ణపతకం పొందాడు.

* 1992లో కోల్‌కత్తాలో జరిగిన జాతీయస్థాయి బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీలకు ప్రాతినిధ్యం, పశ్చిమబెంగాల్‌లో జరిగిన ఆలిండియా ఆహ్వానిత బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీలకు ప్రాతినిధ్యం. అదే ఏడాది రంగారెడ్డి జిల్లాలో జరిగిన రాష్ట్రస్థాయి బాక్సింగ్‌ పోటీల్లో స్వర్ణపతకం కైవసం చేసుకున్నాడు.

* 1993లో విశాఖపట్నంలో జరిగిన రాష్ట్రస్థాయి ఓపెన్‌ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో స్వర్ణపతకం.
* 1994లో విశాఖపట్నంలో జరిగిన ఐ.ఎస్‌.ఆర్‌.నాయుడు మెమోరియల్‌ బాక్సింగ్‌ పోటీల్లో స్వర్ణపతకం.
* 1996లో సికింద్రాబాద్‌లో జరిగిన రాష్ట్రస్థాయి బాక్సింగ్‌ పోటీల్లో రజత పతకం కైవసం.
* 2010లో విశాఖపట్నంలో జరిగిన రాష్ట్రస్థాయి బాక్సింగ్‌ పోటీల్లో పాల్గొనున్న జిల్లా జట్టుకు శిక్షకులుగా వ్యవహరించారు.

ఉత్తమంగా తీర్చిదిద్దాలి..
ఆర్థిక పరిస్థితులు బాగోలేక ఆటో నడుపుతున్నా. ఇప్పటికీ ప్రతిదినం ఉదయం స్థానికంగా బాక్సింగ్‌ క్రీడలో శిక్షణ పొందుతూనే, పలువురు యువకులకు శిక్షణనిస్తున్నా. 2009లో చెన్నైలో జరిగిన యూత్‌ నేషనల్స్‌లో పాల్గొని స్వర్ణపతకం కైవసం చేసుకొని భారత బాక్సింగ్‌ శిక్షణ శిబిరానికి ఎంపికైన ఎం.గోవింద్‌కు శిక్షణ ఇచ్చా. ప్రభుత్వపరంగా ఏదైనా సాయం అందిస్తే స్వయం ఉపాధి పొందుతూనే జిల్లా నుంచి పలువురి యువకులను అంతర్జాతీయ, జాతీయ స్థాయి బాక్సర్లుగా తీర్చిదిద్దుతా.
- ఉమామహేశ్వరరావు

  • =============================================
Visit my website -> Dr.seshagirirao-MBBS

Wednesday, June 9, 2010

Poornachandana.K , పూర్ణ చందన క్రీడాకారిణి




శ్రీకాకుళం పట్టణం లో 9 వ వార్డు లొ అమ్మానగర్ లో నివశిస్తున్న కర్రి రవిప్రసాద్ , వెంకరరమణమ్మ ల రెండో కుమార్తె పూర్ణచందన చిన్ననాటి నుంచి కెఇకెట్ , కరాటే క్రీడల్లో ప్రతిభ కనబరుస్తూ ప్రస్తుతం ప్రభుత్వ వుమెన్స్ కాలేజీ లొ డిగ్రీ చదువు తుంది . ఈమె 11 ఏళ్ళ వయసులోనే క్రికెట్ , కరాటే క్రీడల్లో అడుగు పెట్టి విజయ కేతనం ఎగురవేసినది . శ్రీకాకులం జిల్లా కీర్తిని రాస్ట్ర స్థాయిలో చాటుతూ ముందుకు వెళ్తూంది .

  • 2000 లో విశాఖ పట్ణం లో జరిగిన రాస్ట్రస్థాయి పోటీల్లో ఆరెంజ్ బెల్ట్ సాధించింది .
  • 2003 లో కటాస్ విభాగం లో ప్రతిభ .... స్పారిన్ విభాగము లో ద్వితీయ బహుమతి సాదించింది ,
  • 2004 లో కడప లో నిర్వహించిన కరాటీ రాష్ట్ర స్థాయి అథ్లెటిక్ లో ప్రధమ స్థాయి లో నిలిచింది .
  • 2008 లో విశాఖపట్నం లో నిర్వహించిన జోన్ పోటీల్లో వైస్ కెప్టెన్ గా వ్యవహరించింది .
  • 2009 ఆగస్టు లొ అనంతపురం లో జరిగిన జోన్ మీట్ లో రెండో సారి రా్ష్ట్ర స్థాయి పోటీల్లో బెస్ట్ ప్లేయర్ గా ప్రతిభ కరబర్చింది .
  • =============================================
Visit my website -> Dr.seshagirirao-MBBS

మార్పు జగన్నాధరావు రంగస్థల నటుడు , Marupu Jagannadharao Stage Artist




రంగస్థల నటుడు జగన్‌ మృతి----june /2010
ప్రముఖ రంగస్థల, సినీ నటుడు, జాతీయస్థాయి వాలీబాల్‌ క్రీడాకారుడు గారకు చెందిన మార్పు జగన్నాథరావు(జగన్‌) బుధవారం మృతిచెందారు. ఈయన గత కొద్దిరోజులుగా అస్వస్థతతో బాదపడుతున్నారు. జడ్పీ ఉపాధ్యక్షుడు మార్పు ధర్మారావుకు సోదరుడాయన.
  • బాలనాగమ్మ,
  • సత్యహరిశ్చంద్ర,
  • మాయాబజార్‌,
  • కురుక్షేత్రం, .....................
ఇలా పలు రంగస్థల నాటకాల్లో విభిన్నమైన పాత్రలు పోషించారు. భారతంలో శంఖారావంతో పాటు మరో రెండు చిత్రాల్లో కూడా నటించారు. వాలీబాల్‌ క్రీడలో రాష్ట్ర, జాతీయస్థాయిల్లో పాల్గొని బహుమతులు పొందారు. గారలో శ్రీరామ యూత్‌క్లబ్‌ పేరుతో యువజన సంఘాన్ని స్థాపించి పలు సామాజిక, సేవా కార్యక్రమాలు నిర్వహించి బహుమతులు అందుకున్నారు.


  • =========================================
Visit my website -> Dr.seshagirirao-MBBS