Tuesday, March 30, 2010

మల్లయ్యశాస్త్రి బంకుపల్లి, Mallayya Sastry Bankupalli




బంకుపల్లి మల్లయ్య శాస్త్రి ... కవి , పండితుడు ,సంస్కర్త , గాంధేయవాది , స్వాతంత్ర సమరయోధుడు .
  • జన్మ స్థలము : సింగుపురము .. శ్రీకాకులం మండళం లో
  • పుట్టినతేదీ : 29-04-1876 ,
  • మరణము : 26-09-1947 ,
రచనలు :
  • ఆంధ్ర వేదములు ,
  • అనుభూతిప్రకాశము ,
  • అస్పృశ్యత ,
  • వివాహతత్వము,
  • కొండవీటి విజయము ,
  • యక్షగాన తత్వము ,
  • భగవద్గీతా తత్వము ,
  • సాహిత్యసర్వస్వము , ... మున్నగునవి ,


కందుకూరి వీరేశలింగం విధవలకు పెళ్లిళ్లు చేస్తే దీన్ని మరింతగా సంస్కరించారు జిల్లాకు చెందిన బంకుపల్లి మల్లయ్య శాస్త్రి. చిన్నవయస్సులో పెళ్లయి గర్భాదానం జరగకుండా విధవ అయిన కన్యలకు వివాహం జరిపించి ఆదర్శంగా నిలిచారు. జీలకర్ర, బెల్లం పెట్టి తాళి కట్టినంత మాత్రాన వివాహం జరిగినట్టు కాదని, గర్భాదానం అయితేనే వివాహం అయినట్టు అని ఆయన వాదించారు. ఈ పద్ధతి మొదటిగా ఆయన తన ఇంట్లో పాటించడంతో ఆయన్ను ఆనాడు సంఘం నుంచి వెలివేసినా మొక్కవోని ధైర్యంతో సవాల్‌ స్వీకరించి వివాహతత్వం అనే గ్రంథాన్ని రచించి చరిత్రలో చిరస్మరణీయుడయ్యారు. ఆయన కృషికి పాండిత్యానికి మెచ్చి ఇంటాక్‌ సంస్థ నాగావళి మూడో వంతెనపై విగ్రహాన్ని ప్రతిష్టించింది(06/07/2009) . అంతటి మహానీయులు ఉండడం జిల్లాకు గర్వకారణం.

  • =========================================
Visit my website -> Dr.seshagirirao-MBBS

Sunday, March 7, 2010

దూసి బెనర్జీ ,Dusi Benarji





బహుముఖ ప్రజ్ఞాశాలి!


రంగస్థల నటుడు, భక్తిగీతాల గాయకుడు, వ్యాఖ్యాత, తబలా కళాకారుడు, సంగీత దర్శకుడు, హరికథా భాగవతార్‌.. ఇవన్నీ కలబోసి పోతపోసిన బహుముఖ ప్రజ్ఞాశీలి దూసి బెనర్జీ. హరికథా కళారూపం పేరు చెప్పగానే గుర్తొచ్చేది బెనర్జీయే. కాగా మంచినటుడిగా సుకుమార్‌ ఆర్కెస్ట్రా నిర్వహకుడిగా తెలిసేది కొందరికే. 1948లో కన్యాశుల్కం నాటకంలో వెంకటేశం పాత్రతో ప్రారంభమైన ఆయన నటజీవన ప్రస్థానం జె.వి.సోమయాజులు, జె.వి.రమణమూర్తి (నటరాజ్‌ కళాసమితి), రావికొండలరావుల శిష్యరికంలో ఎన్నో పాత్రలు ధరించి తన ప్రత్యేకతను చాటుకున్నారు.

చిన్ననాటి నుంచే సంగీత సాధన
చిరుప్రాయం నుంచే సంగీతం, పాటలు పాడటం మొదలుపెట్టిన ఆయన తబలా వాయిద్యం కూడా స్వయంకృషితో నేర్చుకున్నదే. 'రాధామనసు' లలిత గీతాలు పుస్తకం రాయడమే కాకుండా కొన్ని పాటలు రేడియోలో ప్రసారమయ్యాయి. గీతోపదేశం పేరిట భగవద్గీతను పాటల రూపంలో రాసి ప్రచురించారు. సుధా బిందువులు సినిమాలో సంగీతం నిర్వహిస్తూ పాటలు పాడారు. అరసవల్లిలో ఏటా జరిగే స్వామివారి ఏకాంతసేవ సంగీత రూపకంలో సూత్రధారునిగా, వ్యాఖ్యాతగా వ్యవహరిస్తాన్నారు.

సుకుమార ఆర్కెస్ట్రాలో..
1955లో సుకుమార ఆర్కెస్ట్రాను సినీనటుడు రావికొండలరావుతో కలిసి స్థాపించారు. బండారు చిట్టిబాబు హార్మోనియం, బెనర్జీ తబలాతో వాద్య సహకారం అందించేవారు. సినీ నేపథ్య గాయకుడు జి.ఆనంద్‌, మండపాక శారద, బి.వి.రమణ లాంటి వారెందరో శిక్షణ పొంది పాడేవారు. రాష్ట్రంలో, రాష్ట్రేతర ప్రాంతాల్లో వేల ప్రదర్శనలిచ్చారు. జానకీ, ఆనంద్‌, జి.రామకృష్ణ వంటి గాయకుల నరసన పాడారు.

హరికథా భాగవతార్‌గా
దానయ్య భాగవతార్‌ వద్ద హరికథా ప్రక్రియ నేర్చుకున్న బెనర్జీ కొన్నివేల ప్రదర్శనలించారు. ఆంధ్రప్రదేశ్‌ పంచవర్ష ప్రణాళిక కోసం బుర్రకథా కళాబృందాన్ని తీసుకువెళ్లి బంగారు పతకం పొందారు. సీతాకల్యాణం, దక్షయజ్ఞం, శ్రీనివాస కల్యాణం వంటి కథలను గానం చేశారు. ఆయన ఆంగ్లంలోను, హిందీభాషలో కూడా హరికథాగానం చేసి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. తను స్వయంగా రచించి గానం చేసిన గీతోపదేశం, దుర్గాబాయ్‌ దేశ్‌ముఖ్‌, రాణిరుద్రమ, షిరిడీసాయిబాబా కథలు గానం చేశారు. జ్ఞానపీఠ పురస్కార గ్రహీత విశ్వనాధ, మాజీ ముఖ్యమంత్రి ఎన్‌.టి.రామారావుల ప్రశంసలు పొందారు.

అవార్డులు-
* మద్రాస్‌ తెలుగు అకాడమీ పురస్కారం టి.వి.కె.శాస్త్రి ఇచ్చారు.
* మాజీ ముఖ్యమంత్రి ఎన్‌.టి.రామారావుచే సత్కారం
* అప్పటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి (జీవితగాథను పాటగా విన్పించి) సత్కారం పొందారు.
* కలెక్టర్లు, రాష్ట్రమంత్రులు, పలు సందర్భాల్లో సత్కారాలు, ప్రశంసలు

జీవనభృతి రూ.1,000కి పెంచాలి
కొన్ని దశాబ్దాలుగా రచయిత, గాయకుడు, నటుడు, హరికథకుడిగా ఎన్నో ప్రదర్శనలు ఇచ్చాను. సొంత ఇల్లు కూడా లేని తాను కళాకారులు, ప్రభుత్వ సంస్థల, వ్యక్తుల ఆర్థిక సహాయం, తి.తి.దే. ప్రదర్శనలివ్వగా వచ్చే ఆదాయంతో జీవనం సాగిస్తున్నా అంటూ బెనర్జీ వాపోయారు. ఔత్సాహికులకు హరికథలు, లలిత సంగీతం నేర్పుతూ ధర్మపథంలో జీవించడమే అత్యంత ఆనందంగా ఉంటుంది. గత ఏడునెలలుగా ప్రభుత్వం ఇచ్చే పింఛను అందడం లేదు. కళాకారుల జీవనభృతిని రూ.1,000కి పెంచాలని కోరుతున్నారు .

మరణము : 28-అక్టోబర్ -2011.

రాలిపోయిన కళా పుష్పం-బెనర్జీ భాగవతార్‌ ఇకలేరు
న్యూస్‌టుడే - శ్రీకాకుళం (సాంస్కృతిక): ఓ కళాపుష్పం రాలిపోయింది. కళారంగం మూగబోయింది. సంగీత కళాకారుడిగా, నటుడిగా, వాద్యకళాకారుడిగా, రచయితగా, హరికథా భాగవతార్‌ బహుముఖ ప్రజ్ఞాశాలి దూసి బెనర్జీ భాగవతార్‌ ఇకలేరు. శ్రీకాకుళం పుణ్యపువీధిలో ఉంటున్న ఆయన గత అయిదు నెలలుగా క్యాన్సర్‌ వ్యాధితో బాధపడ్డారు. చివరకు శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన సొంత గ్రామం దూసి. అసలు పేరు కూర్మనాధశర్మ. తూర్పు భాగవతం పాడడం వల్ల సురేంద్రనాధ్‌ బెనర్జీ అని పిలిచేవారని గతంలో ఆయన 'న్యూస్‌టుడే'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. 1946 నుంచి నాటకాల్లో వివిధ పాత్రలు వేశారు. కన్యాశుల్కం నాటకంలో వెంకటేశం పాత్రతో నటజీవితం ప్రారంభమైంది. 1955లో బండారు చిట్టిబాబు, రావి కొండలరావులతో కలిసి బెనర్జీ సుకుమార ఆర్కెస్ట్రాను ప్రారంభించారు. కొన్నాళ్లు ఖాదీ పరిశ్రమలో ఉద్యోగం చేశారు. 1956లో బుర్రకథ ప్రదర్శనలు, 1970 నుంచి హరికథాగానం చేయడం ప్రారంభించారు.

  • Courtesy with Eenadu Newspaper.
1988లో తెలుగుదేశం పార్టీ వార్షికోత్సవంలో సీతాకల్యాణం ఆంగ్లంలో హరికథాగానం చేసి మాజీ ముఖ్యమంత్రి ఎన్‌.టి.రామారావు ప్రశంసలు పొందారు. రాష్ట్రంలోను, రాష్ట్రేతర ప్రాంతాల్లోని ఎన్నో వేదికలపై ప్రదర్శనలు ఇచ్చారు. అప్పటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి నుంచి సత్కారం పొందారు. అరసవల్లి రథసప్తమి వేడుకల్లో ఏటా నిర్వహించే ఏకాంతసేవలో దూసి బెనర్జీ సూత్రధారునిగా జి.ఆనంద్‌ వంటి గాయకుల సరసన పాడారు. రంగస్థల నటుడు, భక్తీగీతాల గాయకుడు, వ్యాఖ్యాత, తబలా, సంగీత దర్శకుడు, హరికథాభాగవతార్‌ ఇవన్నీ కలబోసి పోతపోసిన బహుముఖ ప్రజ్ఞాశీలి దూసి బెనర్జీ. జె.వి.సోమయాజులు, జె.వి.రమణమూర్తి (నటరాజ్‌ కళాసమితి) రావికొండలరావు శిష్యరికంలో ఎన్నో పాత్రలు ధరించి తన ప్రత్యేకత చాటుకున్నారు.

  • =============================================
Visit my website -> Dr.seshagirirao-MBBS