Friday, February 19, 2010

తంగి సత్యనారాయణ , Tangi Satyanarayana





శ్రీకాకుళం జిల్లా నుండి ఈయనోక్కరే స్పీకర్ గా చేశారు . చాలా మంచి స్వభావము కలవారు . వెలమ కులములో పుట్టి న్యాయవాది గా ఎదిగి రాజకీయాలలో అత్యున్నత పదవి అయిన అసంబ్లీ స్పీకర్ గా ఎన్నికయ్యారు . రాష్ట్ర శాసనసభ మాజీ స్పీకర్‌ తంగి సత్యనారాయణ(78) : శ్రీకాకుళం రూరల్‌ మండలంలో కిల్లి పాలెంలో 1931 సెప్టెంబరు 8న జన్మించిన సత్యనారాయణకు భార్య ఆదిలక్ష్మి, నలుగురు కుమార్తెలు, నలుగురు కుమారులు ఉన్నారు. గార సమితికి ప్రప్రథమ అధ్యక్షునిగా 1959-64లో రాజకీయ జీవితం ప్రారంభించిన ఆయన 1967-72 మధ్య స్వతంత్య్ర పార్టీ తరపున శాసనసభ్యునిగా చేశారు.1972లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు, తిరిగి 1983లో రెండోసారి శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి శాసనసభ్యునిగా ఎన్నికై ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏడాదిన్నర పాటు శాసనసభ స్పీకరుగా వ్యవహరించారు. 1984లో నాదెండ్ల భాస్కరరావు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో నెలరోజుల పాటు రెవెన్యూ శాఖా మంత్రిగా విధులు నిర్వర్తించారు.తిరిగి 1986లో తెలుగుదేశం పార్టీలో చేరారు. మళ్లీ 2008లో తంగి సత్యనారాయణ కాంగ్రెస్‌లో చేరారు. రెండుసార్లు బార్‌ అసోసియేషన్‌కు అధ్యక్షులుగా ఎన్నికైన ఈయన క్రిమినల్‌ లాయర్‌గా జిల్లాలో మంచి ఖ్యాతి నార్జించారు. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోథులు గౌతు లచ్చన్న, ఎన్‌.జి.రంగాలకు సహచరునిగా రాజకీయాల్లో కొనసాగారు. ఎ.ఐ.సి.సి. సభ్యులుగా కాంగ్రెస్‌ పార్టీ లో కొనసాగేరు .

తంగి సత్యనారాయణ - శ్రీకాకుళంలోని తన నివాసంలో 25 / October /2009 , ఆదివారం ఉదయం కన్నుమూశారు.అన్నవాహికలో ఏర్పడిన క్యాన్సర్‌తో గత కొంతకాలంగా బాధపడుతున్న ఆయనకు హైదరాబాద్‌లో ఇటీవలనే శస్త్రచికిత్సలు కూడా నిర్వహించారు.

  • 02/11/2011 న తంగి విగ్రహాన్ని శ్రీకాకుళం న్యూ బ్రిడ్జి రోడ్ లో ఆవిష్కరించబడినది .
Add by Tangi family in Eenadu Local edition 20121120.
  • =====================================================

Visit my website -> Dr.seshagirirao-MBBS

Monday, February 15, 2010

గరిమెళ్ళ సత్యనారాయణ , Garimella Satyanarayana





స్వాతంత్ర్యోద్యమ కవుల్లో గరిమెళ్ళ సత్యనారాయణది విశిష్టమైన స్థానం. గరిమెళ్ళ గేయాలు జాతీయ వీరరసంతో తొణికిసలాడుతూ పాఠక జనాన్ని ఉర్రూతలూగించాయి. అతను వ్రాసిన ' మా కొద్దీ తెల్ల దొరతనం .... " పాట సత్యాగ్రహులకు గొప్ప తెగువను, ఉత్తేజాన్ని కలిగించింది. అలాగే " దండాలు దండాలు భారత మాత ' అనే గీతం కూడా ప్రజలను ఎంతగానో జాగృతం చేసి స్వాతంత్ర్య ఉద్యమంలోకి ఉరికే తెగువను కలగజేసింది. దేశభక్తి కవితలు వ్రాసి జైలుశిక్ష అనుభవించిన వారిలో ప్రధముడు గరిమెళ్ళ. నిజాయితీకి, నిర్భీతికి గరిమెళ్ళ మారుపేరుగా నిలిచాడు. మాకొద్దీ తెల్ల దొరతనం పాట ఆనాడు ప్రతి తెలుగు వాడి నోటా మార్మోగేది. ఆయనంత ప్రసిద్ధినొందిన జాతీయకవి ఆ రోజుల్లో మరొకరులేరు. తెలుగునాట జాతీయ కవిత్వానికి ఒరవడి పెట్టిన కవి ప్రముఖుడు గరిమెళ్ళ.
తొలి జీవితం

గరిమెళ్ళ సత్యనారాయణ శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలములోని ప్రియాగ్రహారం గ్రామంలో 1893 జూలై 15 న (some said-july 14) జన్మించాడు. తల్లి సూరమ్మ, తండ్రి వేంకట నరసింహం. గరిమెళ్ళ ప్రాధమిక విద్య స్వగ్రామమైన ప్రియాగ్రహారంలో సాగింది. విజయనగరం, మచిలీపట్నం, రాజమహేంద్రవరం మొదలైనచోట్ల పైచదువులు చదివాడు. బి.ఏ. పూర్తి చేశాక గంజాం కలెక్టర్ కార్యాలయంలో గుమస్తాగా కొంతకాలం పనిచేశాడు. ఆ తరువాత విజయనగరం ఉన్నత పాఠశాలలో ఉపాథ్యాయుడిగా కొంతకాలం పనిచేశాడు. గరిమెళ్ళ చిన్నప్పుడే మేనమామ కూతుర్ని వివాహం చేసుకున్నాడు. అతని స్వేచ్ఛాప్రియత్వం వల్ల ఎక్కువకాలం ఏ ఉద్యోగమూ చెయ్యలేకపోయాడు.

జాతీయోద్యమ స్ఫూర్తి

1920 డిసెంబర్‍లో కలకత్తాలో జరిగిన కాంగ్రెసు మహాసభలో సహాయనిరాకరణ తీర్మానం అమోదించబడింది. ఆ వీరావేశంతో ఉద్యమంలోకి దూకిన గరిమెళ్ళ ' మా కొద్దీ తెల్లదొరతనం పాటను వ్రాశాడు. ఆనాటి రోజుల్లో రాజమండ్రిలో ఈ పాట నకలు కాపీలు ఒక్కొక్కటి బేడా ( 12 పైసలు) చొప్పున అమ్ముడు పోయేవట. ఆనోటా- ఈనోటా ఈ పాట గురించి ఆనాటి బ్రిటీషు కలెక్టరు బ్రేకన్ చెవినపడి ఆయన గరిమెళ్ళను పిలిపించి పాటను పూర్తిగా పాడమన్నారట. గరిమెళ్ళ కేవలం రచయితే కాదు , గొప్ప గాయకుడు కూడా. తన కంచు కంఠంతో ఖంగున పాటలు కూడా పాడగలడు. గరెమెళ్ళ పాట విన్న బ్రిటీషు కలెక్టరు తెలుగుభాష నాకు రాకపోయినప్పటికీ, ఈ పాటలో ఎంతట మహత్తర శక్తి ఉందో , సామాన్య ప్రజల్ని సైతం ఎలా చైతన్యపర్చగలదో నేను ఊగించగలనన్నాడట. ఆ పాటను వ్రాసినందుకు గరిమెళ్ళకు ఒక సంవత్సరం కఠిన కారాగార శిక్ష విధించారు. ఆ రోజుల్లో కాంగ్రెసు స్వచ్ఛంద సేవకులు ఖద్దరు దుస్తులు ధరించి, గాంధీటోపి పెట్టుకుని, బారులు తీరి మువ్వన్నెల జెండా ఎగరవేసుకుంటూ.

మాకొద్దీ తెల్లదొరతనం- దేవ
మాకొద్దీ తెల్లదొరతనం అంటూ
ఆకాశం దద్దరిల్లేలా పాడుతూ వీధుల్లో కవాతు చేసేవారట.

శిక్షపూర్తి చేసుకుని జైలు నుంచి విడుదల అయిన గరిమెళ్ళ మళ్ళీ ప్రజల మధ్య గొంతెత్తి పాడసాగాడు. ప్రజల్ని ఎంతగానో ఆకట్టుకోసాగాడు. ఇది చూసి ప్రభుత్వాధికారులు భయపడ్డారు. గరిమెళ్ళ బయట వుండటం ప్రభుత్వాధికారులు భయపడ్డారు. గరిమెళ్ళ బయట వుండటం ప్రభుత్వానికి మంచిది కాదని భావించి ఆయనను అరెస్టు చేశారు. కాకినాడ మేజిస్ట్రేట్ ముందు హాజరు పరచారు. మేజిస్ట్రేట్ రెండు సంవత్సరములు కఠిన కారాగార శిక్ష విధించాడు. గరిమెళ్ళ జైలులో వుండగా 1923 జనవరిలో ఆయన తండ్రి చనిపోయాడు. క్షమాపణ చెబితే ఒదులుతామని చెప్పారట. కాని గరిమెళ్ళ క్షమాపణ చెప్పకుండా జైలులోనే వున్నాడు. అంతటి దేశ భక్తుడు ఆయన.

బతుకు పుస్తకం

జైలు నుంచి విడుదల కాగానే ప్రజలు ఆయనకు ఎన్నోచోట్ల సన్మానాలు చేశారు. ఆయన జీవితంలో మధుర ఘట్టం ఇదొక్కటే. ఆ తరువాత కొద్దిరోజులకు భార్య చనిపోయింది. అప్పుడాయనకి ఇద్దరు కుమార్తెలు. గరిమెళ్ళ మళ్ళీ పెళ్ళి చేసుకున్నాడు. అప్పులు పెరగడంతో వున్న ఆస్తి అమ్మేసి అప్పులు తీర్చాడు. ఉద్యోగం వదిలేశాక కొంతకాలం ప్రియాగ్రహారంలో గ్రంథాలయ కార్యదర్శిగా పనిచేశాడు. శ్రీ శారదా గ్రంథమాల స్థాపించి పద్దెనిమిది పుస్తకాలు అచ్చువేశాడు. అవి అమ్ముడుపోలేదు. ఆయన ఎక్కువగా రాజమండ్రి, విజయవాడ, మద్రాసులకు తిరుగుతూ వుండడంతో, వాటిని పట్టించుకోక పోవడం వల్ల వాటిని చెదలు తినేశాయి. వాటి వల్ల కూడా కొంత నష్టం వచ్చింది.

రచనలు

1921 లో గరిమెళ్ళ ' స్వరాజ్య గీతములు ' పుస్తకం వెలువడింది. 1923లో హరిజనుల పాటలు, 1926లో ఖండకావ్యములు, భక్తిగీతాలు , బాలగీతాలు మొదలైన రచనలు వెలువడ్డాయి. గరిమెళ్ళ చాలాసార్లు జైలు శిక్ష అనుభవించాడు. జైలులో వుండగా తమిళ, కన్నడ భాషలు నేర్చుకున్నాడు. తమిళ, కన్నడ గ్రంథాలను తెలుగులోకి అనువదించాడు. ఆంగ్లంలో కూడా గరిమెళ్ళ కొన్ని రచనలు చేశాడు. ఆంగ్లం నుంచి కొన్ని గ్రంథాలను తెలుగులోకి అనువదించాడు. భోగరాజు పట్టాభిసీతారామయ్య ఆంగ్లంలో వ్రాసిన ' ది ఎకనామిక్ కాంక్వెస్ట్ ఆఫ్ ఇండియా' అనే గ్రంథాన్ని తెలుగులోకి అనువదించాడు. గరిమెళ్ళ జీవనోపాధి కోసం 1933లో మద్రాసు చేరుకున్నాడు. అక్కడ గృహలక్ష్మి పత్రిక సంపాదకుడుగా ఉద్యోగంలో చేరాడు. కొంతకాలం తరువాత అక్కడ మానివేసి ఆచార్య రంగా, వాహిని పత్రికలో సహాయ సంపాదకుడుగా చేరాడు. కొద్ది రోజులతర్వాత ఆంధ్రప్రభలో చేరాడు. కొంతకాలం ఆనందవాణికి సంపాదకుడుగా పనిచేశాడు. కొంతకాలం ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా జీవనం సాగించాడు.

చివరిదశ

గరిమెళ్ళ పేదరికం అనుభవిస్తున్న రోజుల్లో దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు కొంత సహాయ పడ్డాడు. వావిళ్ళ వేంకటేశ్వర శాస్త్రులు ప్రతినెలా ఆయనకు ఆర్థిక సహాయం చేసేవాడు. వివిధ పత్రికలకు, ఆలిండియా రేడియోకి రచనలు చేసి కొంత గడిస్తున్నా ఆయన అవసరాలకు ఆ డబ్బు చాలలేదు. ఒకవైపు పేదరికం, మరోవైపు అనారోగ్యం ఆయనను బాగా దెబ్బతీశాయి. చివరిదశలో ఒక కన్నుపోయింది. పక్షవాతం వచ్చింది. దిక్కులేని పరిస్థితుల్లో కొంతకాలం యాచన మీద బ్రతికాడు.

స్వాతంత్ర్యానంతరం మన పాలకుల వల్ల కూడా గరిమెళ్ళకు చెప్పుకోదగ్గ సహాయం లభించలేదు. దాంతో కొంతమంది మిత్రులు గరిమెళ్ళను ' మాకొద్దీ నల్ల దొరతనం ' అనే గేయం వ్రాయలని అడిగారట. దేశ భక్తుడు, స్వాతంత్ర్య పిపాసి అయిన గరిమెళ్ళ అందుకు అంగీకరించలేదుట. చరమ దశలో దుర్భరదారిద్ర్యాన్ని అనుభవించిన గరిమెళ్ళ 1952 డిసెంబర్ 18వ తేదీన మరణించాడు. ఆయన అంత్యక్రియలు ఇరుగు పొరుగు వారు జరిపారు.



some more information about Garimella Satyanarayan ->see in Wikipedia.org/

  • ======================================================

Visit my website -> Dr.seshagirirao-MBBS

కోడి రామ్మూర్తి నాయుడు , Kodi Ramamurty Naidu





కోడి రామ్మూర్తి నాయుడు (1882?-1942?) ఆంధ్రరాష్ట్రానికి చెందిన ప్రముఖ వస్తాదు మరియు మల్లయోధులు. ఇరవయ్యో శతాబ్దపు తొలి దశకాల్లో ప్రపంచ ఖ్యాతి గాంచిన తెలుగువారిలో అగ్రగణ్యులు. శ్రీకాకుళం జిల్లా వీరఘట్టంలో జన్మించారు. కోడి వెంకన్న నాయుడు వీరి తండ్రి. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయి, తండ్రి ప్రేరణతో విజయనగరంలో తన పినతండ్రి కోడి నారాయణస్వామి దగ్గర పెరిగారు. అక్కడ ఒక వ్యాయమశాలలో చేరి దేహ ధారుడ్యాన్ని పెంచుకోవడంతో పాటు కుస్తీ కూడా నేర్చుకున్నారు. 21 సంవత్సరాల వయసులోనే ఇతడు రొమ్ముపై 1 1/2 టన్నుల భారాన్ని మోసేవాడు. తరువాత 3 టన్నుల భారాన్ని కూడా మోయగలిగాడు. మద్రాసులో సైదాపేట కాలేజిలో ఒక సంవత్సరం వ్యాయామశాలలో శిక్షణ తీసుకుని విజయనగరానికి తిరిగి వచ్చి విజయనగరం ప్రొవిన్షియల్ లోయర్ సెకండరీ పాఠశాలలో వ్యాయమ శిక్షణోపాధ్యాయునిగా పని చేశారు. తరువాత ఒక సర్కస్ సంస్థను స్థాపించి తన బలప్రదర్శనతో దేశ విదేశాలలో ప్రేక్షకులను అబ్బురపరిచారు.మన పురాణాలలో బల శబ్దానికి భీముడు, ఆంజనేయుడు పర్యాయ శబ్దాలైనట్లు ఆంధ్ర ప్రదేశంలో ఇతడి పేరు బలానికి పర్యాయపదంగా పరిగణించబడింది. తన చివరి రోజుల్లో రామ్మూర్తి నాయుడు బలంఘీర్ పాట్నాలో కల్వండే పరగణా ప్రభువు పోషణలో జీవితం గడుపుతూ మరణించారు.
కాలి పై పుట్టిన చిన్న కురుపు పెద్దది ఆపరేషన్ ద్వారా కాలును తొలగించవలసి వచ్చినది . ఆయన ఎన్నో దాన ధర్మాలు చేశారు .1942 జనవరి 13 న భోగిపండుగ నాడు నిద్రలోనే చనిపోయారు .

బలప్రదర్శన విశేషాలు

* గట్టిగా ఊపిరి పీల్చుకుని కండలు బిగించి, తన ఛాతీకి చుట్టిన ఉక్కు తాళ్ళను తెంచేవారు.
* ఛాతీ మీదకు ఏనుగును ఎక్కించుకుని ఐదు నిముషాల పాటు నిలిపేవారు.
* రెండు కార్లను వాటికి కట్టిన తాళ్ళు రెండు చేతులుతో పట్టుకుని కదలకుండా ఆపేవారు.

బిరుదులు

ఆనాటి ఇంగ్లండు పాలకులైన కింగ్ జార్జ్, క్వీన్ మేరీలు రామ్మూర్తి నాయుడి బల ప్రదర్శనకు అబ్బురపడి, 'ఇండియన్ హెర్క్యులెస్' అనే బిరుదును ప్రసాదించారు. ఇంకా కలియుగ భీమ, మల్ల మార్తాండ, జయవీర హనుమాన్, వీరకంఠీరవ వంటి బిరుదులను కూడా సొంతం చేసుకున్నరు.

udate: 18-01-2014

భోగి పండగనాడు చనిపోయిన కోడి రామమూర్తి నాయుడు గారి72 వ వర్ధంతిని తెలగ కుల సంఘం మంగళవారము అనగా 14-01-2014 (ఈ సం.భోగి 14 న చేయడం జరిగినది)తేదీన ఘనం గా నివాళులు అర్పించారు. నాగావళి నది మూడవ వంతెన పై ఉన్న ఆయన విగ్రహnనికి పూల దండలు వేసారు. కోడి రామమూర్తి నాయుడు గారు శ్రీకాకుళం జిల్లా వీరఘట్టాం లో తెలగ కులము లో జన్మించారు.


  • ============================
Visit my website -> Dr.seshagirirao-MBBS

బరాటం నీలకంటస్వామి , Baratam Neelakantaswamy





















బరాటం నీలకంట స్వామి శ్రీకాకుళం టౌన్ లో ప్రముఖ హోల్ సేల్ & రిటైల్ బట్టలు మరియు మెడికల్ వ్యాపారవేత్త . ఈయన్ని ముద్దుగా శశి గారు అని పిలుస్తారు . వ్యాపార కులమైన " కోమటి " కులము లో పుట్టి ధనార్జనే ముఖ్యం కాదని చిన్నతనం నుండి ఆధ్యాత్మికముగాను , సేవాపరము గాను ఎన్నో ఎన్నో కార్యక్రమాలు చేశారు . తానూ ఎన్ని మంచి పనుచేసినా వ్యక్తిగత ప్రచారమునకు ఇష్టపడేవారు కాదు .
నీలకంట స్వామీ గారు 08 / 11 / 1918 లో జన్మించారు . తన 89 వ యేట 05/01 / 2007 తేదీన చనిపోయారు . సుమారు 50 సం.లు హోల్ సేల్ బట్టల వ్యాపారము చేశారు . ఈయన భార్య పేరు శశి రేఖ గారు . వీరికి ముగ్గురు కుమారులు , ఐదుగురు కుమార్తెలు .
పెద్దకుమారుడు -- అప్పన్న శెట్టి , శ్రీ శ్రీనివాస మెడికల్ ఏజెన్సీ - మందుల వ్యాపారము ,
రేండెవ కుమారుడు -- వెంకటరమణ మూర్తి , బి.యన్.యస్.సన్స్ - మందుల వ్యాపారము ,
మూడవ కుమారుడు -- లక్ష్మణరావు , బి.యన్.యస్. ఏజెంసేస్ పేరిట - మందుల వ్యాపారము ,
కుమార్తెలు - అల్లుళ్ళు
1.జామి రాజేశ్వరి - దశరధుడు , శ్రీ కామేశ్వరి మెడికల్ అగేన్సేస్ , శ్రీకాకుళం ,
2. నారాయనశెట్టి శాకున్తల్ - సత్యనారాయణ , మెహర్ మెడికల్ ఎంటర్ ప్రైజెస్ , శ్రీకాకుళం ,
3. వైష్యరాజు అనసూయ - జగ్గరాజు , ఎరువుల వ్యాపారము , బ్రాహ్మణతర్లా ,
4. గేమ్బలి చంద్రావతి - మోహనరావు , లక్ష్మి మెడికల్ హాల్ , బొబ్బిలి .
5 . పతనాన లకష్మీకుమారి - డా.రత్న సోమేశ్వరరావు .. శ్రీనివాస నర్సింగ్ హోం కాశిబుగ్గ ,

నీలకంతం గారి సేవ మరియు ధర్మ కార్యక్రమాలు ->
  • ప్రధాన గాన సంగము వ్యవస్తాపక సభ్యులు ,
  • సత్యసాయి మందిరం (బాపూజీ కళా మందిరం ప్రక్కన) సహా నిర్మాణ కర్త ,
  • ఉపనిషత్ మందిరం నిర్మాణ సహాయ కర్త ,
  • బరాటం నీలకంతస్వామి ఉచిత వైద్య సేవా కేంద్ర వ్యవస్తాపకులు ,
  • శ్రీ వర సిద్ది వినాయక పంచాయతన దేవాలయ(PNcolony) వ్యవస్తాపక ట్రస్టీ సభ్యుని గా ,
  • కాలింగ వైశ్య కళ్యాణ మండపం నిర్మాణ దాత గా ,
  • శ్రీకాకుళం వయోవృద్ధుల ఆశ్రమం నిర్మాణ దాత గా ,
  • ఎన్నో పాడుపడిన , దీనావస్తలో ఉన్న దేవ్వాలయాలు పునర్నిర్మాణ ము లో పాలు పంచుకున్నారు .
  • ఎంతో మంది పేద విద్యార్దుల చదువుల సహాయ దాత గా సేవలందించారు .

ఈయన పేరున ఎన్నో ఆద్యాత్మిక పుస్తకాలు ముద్రించి ఉచితం గా పంపినీ చేస్తున్నారు .
నామకే కొన్ని పుస్తకాలు ->
  • వినాయక వ్రతకల్పం ,
  • మన పండుగలు వాటి వివరాలు ,
  • శ్రీకాకుళం జిల్లా చరిత్ర ,
  • శివరాత్రి - సివమహత్యం -శివతత్వం ,
  • పెద్దబాల శిక్ష ,
  • ఆద్యాత్మిక తరంగిణి ,

  • ===================================================

Visit my website -> Dr.seshagirirao-MBBS

కరణం మల్లేశ్వరి , Karanam Malleswari








కరణం మల్లేశ్వరి తెలుగు వారు గర్వించదగిన వ్యక్తి. శ్రీకాకుళంకు చెందిన ఈమె బరువులు ఎత్తడం ఆటలో ఒలింపిక్ పతకం సాధించి ప్రసిద్ధురాలయ్యింది. ఈమె 1975 జూన్ 1 న జన్మించింది. చిత్తూరు జిల్లా తవణంపల్లి గ్ర్రామములో పుట్టిన మాల్లీశ్వరి తండ్రి ఉద్యోగరీత్యా ఆమదాలవలకు వచ్చారు , ఇక్కడే సెటిల్ అయ్యారు .. మల్లీశ్వరి అక్క నరసమ్మకు జాతీయ వెయిట్ లిఫ్టింగ్ మాజీ కోచ్ నీలంశెట్టి అప్పన్న శిక్షణ ఇచ్చేవారు . అక్క విజయాలను చూచిన మల్లీశ్వరి కూడా ఈ రంగం పై ఆసక్తి పెంచుకున్నారు . చివరకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్నారు . చైనా దేశం లొని గ్యాంగ్ ఝూ లో జరిగిన ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ పోతీల్లో 54 కిలోల విభాగం లో దేశానికి మూడు స్వర్ణపతకాలు తెచ్చరు . ఆ తరువాత టర్కీ రాజధాని ఇస్తాంహుల్ లో జరిగిన పోటేల్లో తన ప్రత్యర్ధి చైనా క్రీడాకారిణి డ్రగ్స్ తీసుకున్నట్లు రుజువుకావడం తో ఆ టైటిల్ ను మల్లీశ్వరికి ప్రధానము చేసారు . 1995 చైనాలో జరిగిన పోతీల్లో వరుసగా 105,110, 113, కిలోల బరువులు ఎత్తి చైనా వెయిట్ లిఫ్టర్ - లాంగ్ యాపింగ్ పేరున ఉన్న ప్రపంచ రికార్డును బద్దలు కొటారు .

  • సిడ్నీలో జరిగిన 2000 ఒలింపిక్ క్రీడలలో వెయిట్ లిఫ్టింగ్ పోటీలో కాంస్య పతకం సాధించింది. ఆ విధంగా ఒలింపిక్ ఆటలలో పతకం సాధించిన మొదటి భారతీయ మహిళ అయ్యింది, మరియు మూడవ భారతీయ వ్యక్తి. (అంతకుముందు పతకాలు సాధించిన భారతీయులు - 1952 హెల్సింకీ లో bantamweightwrestler ఖషబా జాదవ్, మరియు 1996 అట్లాంటాలో టెన్నిస్ క్రీడాకారుడు లియాండర్ పేస్)

పతకాలు, పురస్కారాలు

  • 2000 - ఒలింపిక్ క్రీడలు - కాంస్య పతకం - 69 కిలోగ్రాముల విభాగంలో
  • 1994 - ఇస్తాంబుల్ ప్రపంచ ఛాంపియన్‌షిప్ పోటీలు - బంగారు పతకం
  • 1995 - పూసాన్, కొరియా - ఆసియా ఛాంపియన్‌షిప్ పోటీలు
  • 1995 - ఘుంగ్‌జౌ, చైనా - 54 కిలోల విభాగంలో మూడు బంగారు పతకాలు

భారత ప్రభుత్వం అర్జున అవార్డు
  • 1995 - రాజీవ్ గాంధీ ఖేల్ రత్న బహుమతి
  • 1999- పద్మశ్రీ పురస్కారం

ఒక సందర్భంలో ఆమె ఇలా అంది -

  • భారత దేశానికి పతకాలు ఎందుకు రావని అడుగుతుంటారు. అది ఎయిర్-కండిషన్డ్ గదులలో కూర్చుని మాట్లాడినంత సులభం కాదు. ఆ ప్రయత్నంలో ఉన్న శ్రమ, వేదన మాకు తెలుస్తాయి...






  • ===================================================

Visit my website -> Dr.seshagirirao-MBBS

వాండ్రంగి రామారావు , Vandrangi Ramarao,భావశ్రీ

భావశ్రీ గా పేరుగాంచిన వాండ్రంగి రామారావు తెలుగు సినీ రచయిత, కవి, రాష్ట్ర పురస్కార గ్రహీత, వక్త, వ్యాఖ్యాత , రూపకకర్త, మరియు ఆకాశవాణి ప్రసంగికుడు. భావశ్రీ 1935, జనవరి 26న శ్రీకాకుళం జిల్లాలో జన్మించాడు. ఈయన స్వగ్రామం పొందూరు మండలములోని సంతపురిటి గ్రామము. ఈయన తండ్రి సూర్యనారాయణ సమాజ సేవకుడు. తల్లి అమ్మన్నమ్మ, గృహిణి.

తెలుగు భాషలో ప్రత్యేక బి.ఎ డిగ్రీతో ఉత్తీర్ణుడైన భావశ్రీ తెలుగు, సంస్కృతంతో పాటు హిందీ మరియు ఆంగ్ల భాషలలో కూడా ప్రవేశం ఉన్నది.

  • పేరు : వాండ్రంగి రామారావు
  • జననం : జనవరి 26, 1935
  • నివాసం : సంతవురిటి (గ్రామం), పొందూరు, శ్రీకాకుళం జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ - 532 168
  • ఇతర పేర్లు : భావశ్రీ
  • ప్రాముఖ్యత : రచయిత, కవి, రాష్ట్ర పురస్కార గ్రహీత
  • తండ్రి : సూర్యనారాయణ (మానవతావాది, సామాజిక సేవకులు)
  • తల్లి : అమ్మన్నమ్మ (గృహిణి)


  • =================================================

Visit my website -> Dr.seshagirirao-MBBS

Sunday, February 14, 2010

బలివాడ కాంతారావు , Balivada Kantharao









బలివాడ కాంతారావు ( 1927, జూలై 3 - 2000, మే 6 ) సుప్రసిద్ధ తెలుగు నవలా రచయిత. ఈయన ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాలోని మడపాం అనే గ్రామంలో జన్మించాడు. భారత సైన్యంలో వివిధ కేడర్లలో పని చేశాడు. 38 దాకా నవలలు రాశాడు. ఇంకా 400 దాకా కథలు, 5 నాటికలు, రేడియో నాటికలు రచించాడు. ఈయన రచనలపై కొద్దిమంది పరిశోధనలు కూడా చేశారు. అదే విధంగా ఈయన రచనలు ఇతర భారతీయ భాషలలోకి కూడా అనువదించబడ్డాయి. 1998లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును అందుకున్నారు. ఇంకా చాలా అవార్డులు ఈయన్ని వరించాయి. వీటిలో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు, తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారం, గోపీచంద్ సాహిత్య పురస్కారం, రావిశాస్త్రి స్మారక పురస్కారం, కళాసాగర్ విశిష్ట పురస్కారం ముఖ్యమైనవి. ఐదు దశాబ్దాలపాటు ఏకధాటిగా రచనలు చేసినా, ఏ దశలోనూ ప్రమాణాలపై రాజీ పడలేదు. ఆయన గుణగణాలైనటువంటి నిజాయితీ, నిక్కచ్చితనం, జాలి, దయ, కరుణ మొదలైనవి ఆయన రచనల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తాయి.

రచనలు

* జన్మ భూమి
* అమ్మి
* కావడి కుండలు - 1951
* దొంగలు - 1952
* శిశు విక్రయం - 1952
* పెళ్ళి -1953
* అంతరాత్మ- 1957
* ఇంటికోసం - 1967
* మంటలు - 1968
* ముంగిస కథ - 1969
* నాలుగు మంచాలు 1972 (ఆంధ్ర సచిత్ర వార పత్రికలో ధారావాహికం)
* విలువెంత - 1975
* దగాపడిన తమ్ముడు - ?
* నిగురు తేనె - 1977
* భేదాఘాట్ మొసలి - 1977
* షోవనార (1980)
* కెంపు (1984)
* తేనె పట్టు (1989)
* సుఖ జీవనం (1989)
* ప్రతీక్ష (1990)
* దృష్టి (1991)
* చక్రతీర్థం (1992)
* గోపురం (1994)
* చైత్ర పర్వం (1998)
* తెల్ల కలువ (1998)
* దేవుళ్ళ దేశం (1998)
* Love in Goa (1998)
* అజంతా (1998)
* ఎల్లోరా (1998)







  • ==================================================

Visit my website -> Dr.seshagirirao-MBBS

పింగళి నాగేంద్రరావు ,Pingali Nagendrarao


























పింగళి
నాగేంద్రరావు (Pingali Nagendrarao) (1901 - 1971) ఒక తెలుగు సినిమా రచయిత. పింగళి నాగేంద్రరావు కేవలం సినిమా రచయిత మాత్రమే కాదు. పాత్రికేయుడు, నాటక రచయిత కూడా. కృష్ణా పత్రిక, శారద పత్రికల్లో ఆయన ఉపసంపాదకుడుగా పనిచేసారు. వింధ్య రాణి, నా రాజు, జేబున్నీసా, మేవాడు రాజ్య పతనం, క్షాత్ర హిందు, నా కుటుంబం, గమ్మత్తు చావు తదితర నాటకాలు ఆయన రాసినవే.
బాల్యం

ఆయన 1901 డిసెంబర్ 29 న శ్రీకాకుళం జిల్లా, బొబ్బిలి దగ్గర ఉన్న రాజాం లో జన్మించాడు. ఆయన తండ్రి యైన గోపాల క్రిష్ణయ్య యార్లగడ్డ గ్రామానికి కరణంగా ఉంటూ నాగేంద్రరావు జననానికి పూర్వమే కరణీకాన్ని వదులుకున్ను విశాఖలో ఉన్న ఆయన తమ్ముళ దగ్గరికి వచ్చేశారు. నాగేంద్ర రావు పినతండ్రులలో ఒకరు డిప్యూటీ కలెక్టర్ మరొకరు ప్లీడర్. నాగేంద్రరావుకు అన్నయైన శ్రీరాములు 1913 లోనే భారతదేశాన్ని వదిలి 1926 నుంచి ఆస్ట్రేలియాలో పంచదార ఎగుమతి వ్యాపారం చేస్తూ ఉండేవాడు. పింగళికి రెండేళ్ళ వయసులో బందరుకు వారి కుటుంబం బందరుకు వలస వెళ్ళారు.
విద్యాభ్యాసం

నాగేంద్రరావు తల్లి మహాలక్ష్మమ్మది దివి తాలూకా. ఆయన చిన్నతనం నుంచీ కృష్ణా జిల్లాలోనే ఉంటూ ఆంధ్ర జాతీయ కళాశాలలో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. కోపల్లె హనుమంతరావు ప్రభృతులు స్థాపించిన ఈ కళాశాలలో తొలి విద్యార్థుల బృందంలో నాగేంద్రరావు ఒకడు. మంగినపూడి పురుషోత్తమ శర్మ అనే సుప్రసిద్ధ కవీ, మాధవపెద్ది వెంకట్రామయ్య అనే ప్రఖ్యాత స్టేజీ నటుడు ఆయనతో పాటు చదువుకున్న వాళ్ళే. ఆంధ్రకంతటికీ గర్వకారణంగా వెలసిన ఆంధ్ర జాతీయ కళాశాల యొక్క తొలి విద్యార్థులలో ఒకడైన కారణం చేత కోపల్లె హనుమంతరావు, భోగరాజు పట్టాభి సీతారామయ్య, ముట్నూరి కృష్ణారావు మొదలైన వారి పరిచయం లభించింది.

పూర్తీ వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి ->Pingali Nagendrarao

  • ================================================

Visit my website -> Dr.seshagirirao-MBBS

Tapi dharmaravu naidu ,తాపీ ధర్మారావు నాయుడు





తాపీ ధర్మారావు నాయుడు (Tapi Dharma Rao Naidu) తెలుగు రచయిత, తెలుగు భాషా పండితుడు, హేతువాది మరియు నాస్తికుడు .

జీవిత చరిత్ర

ధర్మారావు 1887 సంవత్సరంలో సెప్టెంబరు 19న ప్రస్తుతం ఒరిస్సాలో ఉన్న బెర్హంపూరు (బరంపురం-శ్రీకాకుళము కలిసి ఉండేది) లోని ఒక తెలుగు కుటుంబములో జన్మించాడు. ఈయన మాలపిల్ల, రైతుబిడ్డ మొదలైన సినిమాలకు సంభాషణలు రాశాడు. ఈయన ప్రాధమిక విద్యను శ్రీకాకుళంలో, మెట్రిక్యులేషన్ విజయవాడలో, పర్లాకిమిడిలో ఎం.ఏ. వరకు చదువుకొని మద్రాసులోని పచ్చయప్ప కళాశాలలో చేరాడు. పర్లాకిమిడిలో చదివే రోజులలో వ్యవహారిక భాషావేత్త అయిన గిడుగు రామ్మూర్తి ఈయనకు గురువు కావటం విశేషం. ధర్మారావు తల్లిన పేరు నరసమ్మ. తండ్రి అప్పన్న. వీరి ఇంటి పేరు మొదట్లో "బండి" లేదా "బండారు" కావచ్చును. అప్పన్న తాత లక్ష్మయ్య కొంతకాలం మిలిటరీలో పని చేశాడు. తరువాత తాపీ పనిలో మంచి పేరు తెచ్చుకొన్నాడు. అలా అతనికి శ్రీకాకుళంలో "తాపీ లక్ష్మయ్యగారు" అన్న పేరు స్థిరపడిపోయిందట. కల్లికోట రాజావారి కళాశాలలో గణిత ఉపాధ్యాయులుగా పనిచేశాడు. 1910 ప్రాంతంలో కొందరు మిత్రులతో కలిసి బరంపురంలో వేగుచుక్క గ్రంథమాలను స్థాపించాడు. ఇతని తొలి రచన 1911లో 'ఆంధ్రులకొక మనవి' అనే పేరుతో విలువడింది. పత్రికా నిర్వహణలో ఇతని నేర్పు అనన్య సామాన్యమైనది. 'కొండెగాడు', 'సమదర్శిని', 'జనవాణి', 'కాగడా' మొదలైన పత్రికలు ఇతని ప్రతిభకు నిదర్శనాలు. ఇతను 1973 మే 8న మరణించాడు. తెలుగు సినిమా దర్శకులు తాపీ చాణక్య ఇతని కుమారుడు.


విశేషాలు
  • ఉమ్మడి రాష్ట్రంగా వున్న రోజుల్లో బొబ్బిలి రాజా వారు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నప్పుడు- ధర్మారావుగారు ఆయన దగ్గర కార్యదర్శిగా పనిచేశారు.
  • ఆంధ్ర రాష్ట్ర పత్రికా రచయితల మహాసభ జరిగినప్పుడు తాపీవారే మొదటి అధ్యక్షులు.
  • 'మాలపిల్ల' (1938) సినిమాకు కథ అందించినది- గుడిపాటి వెంకటచలం.
  • తాపీని గౌరవంగా 'తాతాజీ' అని పిలిచేవారు.
  • తాపీ ధర్మారావు ఎప్పుడు జన్మించారు--1897, సెప్టెంబరు 19.
  • తాపీ ధర్మారావు జన్మించిన ప్రదేశం--బరంపురం.
  • తాపీ ధర్మారావు ఏ పేరుతో ప్రసిద్ధి చెందినారు--తాతాజీ.
  • తాపీ ధర్మారావు ఆత్మకథ--రాళ్ళూ-రప్పలు.
  • తాపీ ధర్మారావు ఏ తెలుగు చిత్రాలకు సంభాషణలు రాశారు--మాలపిల్ల, ద్రోహి, రైతుబిడ్డ.
  • తాపీ ధర్మారావు రచనలపై పరిశోధనచేసి డాక్టరేట్ పొందినది--ఏటుకూరి ప్రసాదరావు.
  • సాహిత్యరంగంలో సేవలకుగాను ధర్మారావు పొందిన అవార్డు--సాహిత్య అకాడమీ అవార్డు (1971).
  • ధర్మారావు గురువు--గిడుగు రామమూర్తి.
  • తాపీ ధర్మారావు శతజయంతి సందర్భంగా 1987లో ఆయన జీవితకథను పుస్తకంగా తెచ్చిన అతని కుమారుడు--తాపీ మోహన్‌రావు.
  • తాపీ ధర్మారావు ఎప్పుడు మరణించారు--1972, మే 8.


రచనలు

1. ఆంధ్రులకొక మనవి
2. దేవాలయాలపై బూతుబొమ్మలు ఎందుకు? 1936
3. పెళ్ళి దానిపుట్టుపూర్వోత్తరాలు 1960
4. ఇనుపకచ్చడాలు
5. సాహిత్య మొర్మొరాలు
6. రాలూ రప్పలూ
7. మబ్బు తెరలు
8. పాతపాళీ
9. కొత్తపాళీ
10. ఆలిండియా అడుక్కుతినేవాళ్ళ మహాసభ
11. విజయవిలాసం వ్యాఖ్య
12. అక్షరశారద ప్రశంస
13. హృదయోల్లాసము
14. భావప్రకాశిక
15. నల్లిపై కారుణ్యము
16. విలాసార్జునీయము
17. ఘంటాన్యాయము
18. అనా కెరినీనా
19. ద్యోయానము
20. భిక్షాపాత్రము
21. ఆంధ్ర తేజము
22. తప్తాశ్రుకణము


  • =====================================================

Visit my website -> Dr.seshagirirao-MBBS

సర్దార్ గౌతు లచ్చన్న, Sardar Gouthu Latchanna





















సర్దార్ గౌతు లచ్చన్న: ఉత్తర కోస్తా కళింగసీమలో ఉద్దానం ప్రాంతాన (నాటి గంజాం జిల్లా) సోంపేట తాలూకాలో బారువా అనే గ్రామంలో 1909 ఆగష్టు 16 వ తేదీన ఒక సాధారణ బీద సెగిడి కుటుంబములో గౌతు చిట్టయ్య, రాజమ్మ దంపతులకు 8 వ సంతానం గా పుట్టాడు. లచ్చన్న తాత. తండ్రులు సెగిడి కులవృత్తే వారికి కూడుబెట్టేది. ఈతచెట్లను కోత వేసి కల్లు నుత్పత్తి చేయడం, అమ్మడం చుట్టు ప్రక్క గ్రామాల్లో గల కల్లు దుకాణాలకు కల్లు సరఫరా చేయడం వారి వృత్తి. కుల వృత్తిలోకి తమ పిల్లలన్ని దించకుండా చదువులను చెప్పించాలని బారువా లో గల ప్రాధమిక పాఠశాలలో 1916 లో వాళ్ళ నాన్న చిట్టయ్య చేరిపించాడు. లచ్చన్న బారువా ప్రాధమికోన్నత పాఠశాలలో 8 వ తరగతి వరకు చదివి ప్రక్కనే ఉన్న మందసా రాజావారి హైస్కూల్లో 9 వ తరగతి లో చేరాడు. అక్కడ లచ్చన్న చదువు కొనసాగలేదు. దురలవాట్లు, చెడుసహవాసాలు కొనసాగాయి. పలితంగా 9వ తరగతి తప్పాడు. శ్రీకాకుళంలో లచ్చన్నను ఉన్నత పాఠశాలలో చేర్పించారు. అక్కడ జగన్నాధం పంతులుగారి ఇంటిలొ ఉండి చదువుసాగించాడు. ఆ స్కూల్లో డ్రిల్ మాష్టారు నేమాని నరసింహమూర్తి శిక్షణలో జాతీయ భావాల్ని అలవర్చుకున్నాడు. విద్యార్ధి జీవితంలో మార్పు జీవన విధానంలో మార్పు. ఆలోచన ధోరణిలో మార్పు, జాతి , జాతీయత అంటే ఏమిటి ? అనే ప్రాధమిక రాజకీయ పాఠాల్ని నరసింహమూర్తి వద్దనే నేర్చుకోవడం జరిగింది. లచ్చన్నకు ఆనాటికి 21 సవంత్సరాలు . 1929-30 విద్యా సంవత్సరం స్కూల్ పైనల్ పరీక్షకు సెలెక్ట్ కాబడి హజరైనాడు.

పూర్తి వివరాలకోసం -> Sardar Gouthu Latchanna


ఉత్తరాంధ్రలో 'గ్లో' సేవలు విస్తరణ-- సర్దార్‌ గౌతు లచ్చన్న వర్థంతి సందర్భము గా :

-గౌతు లచ్చన్న బలహీన వర్గాల సంస్థ (గ్లో) ఆధ్వర్యాన ఉత్తరాంధ్రలో మరిన్ని సేవా కార్యక్రమాలు విస్తరింపజేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని సంస్థ కార్యదర్శి యార్లగడ్డ వెంకన్నచౌదరి చెప్పారు. బుధవారం మాజీ మంత్రి గౌతు శివాజీ ఇంటి వద్ద జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈనెల 19న సర్దార్‌ గౌతు లచ్చన్న 6వ వర్థంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బారువ, సోంపేట, హరిపురంలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. సర్దార్‌ ఘాట్‌లో లచ్చన్న దంపతుల విగ్రహాల ఆవిష్కరణ, సోంపేట గాంధీ మండపం వద్ద బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. బారువ కళాశాల బి.సి. విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేస్తామని, లచ్చన్న దీర్ఘకాల సహచరులు బెందాళం రామ్మూర్తినాయుడు, చిన్న నరిసింహమహంతి, అరసవల్లి శివన్నారాయణకు ఘనంగా సన్మానం జరుగుతుందన్నారు. వీటితోపాటు వృద్ధ కళాకారులకు సన్మానం చేసి, ఆర్థికంగా చేయూతనిస్తామని చెప్పారు. రెడ్‌క్రాస్‌ సొసైటీతో కలిసి రక్తదాన శిబిరం నిర్వహిస్తామని చెప్పారు.శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల పరిధిలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, వీటిని మరింత విస్తరింపజేయాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు. పలాస మండల పెదంచల గ్రామాన్ని దత్తత తీసుకొని గ్రంథాలయ భవన నిర్మాణంతోపాటు క్రీడల అభివృద్ధికి ప్రోత్సాహం, ఇతర సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. విజయనగరం జిల్లాలో గరుగుబిల్లి మండలం నాగూరు గ్రామాన్ని దత్తత తీసుకొని విద్య, వైద్య, ఇతర కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. రాష్ట్రంలో మరో 10 ప్రాంతాల్లో సర్దార్‌ గౌతు లచ్చన్న విగ్రహాలను ఏర్పాటు చేస్తామన్నారు. సమావేశంలో సోంపేట సర్పంచి వుట్ల గాంధీ, మాజీ సర్పంచి చిత్రాడ సోమేశ్వరరావు, వ్యాపారవేత్త జి.కె.నాయుడు, పాల్గొన్నారు.(సోంపేట, న్యూస్‌టుడే)


======================================================

Visit my website -> Dr.seshagirirao-MBBS

గిడుగు రామమూర్తి , Gidugu Ramamurty





మనుషులుగా కొందరు పుట్టి , గిడతారు ... కొందరు మాత్రం మనుషులుగా పుట్టి ఏంటో ఖ్యాతి తెచ్చుకుంటారు . వారు గిట్టినా ... మనుషుల మనస్సుల్లో చిరస్తాయిగా నిలుస్తారు .
గిడుగు వేంకట రామమూర్తి - తెలుగులో వాడుక భాషా ఉద్యమ పితామహుడు, గిడుగు వెంకట రామమూర్తి. గ్రాంధికభాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుకభాషలోకి తీసుకు వచ్చి, నిత్య వ్యవహారంలోని భాషలో ఉన్న అందాన్నీ, వీలునూ తెలియజెప్పిన మహనీయుడు. ఆంధ్రదేశంలో వ్యావహారిక భాషోద్యమానికి మూలపురుషుడు. బహుభాషా శాస్త్రవేత్త, చరిత్రకారుడు, సంఘసంస్కర్త, హేతువాది. శిష్టజన వ్యవహారికభాషను గ్రంథరచనకు స్వీకరింపజేయడానికి చిత్తశుద్దితో కృషిచేసిన అచ్చతెలుగు చిచ్చర పిడుగు గిడుగు. గిడుగు ఉద్యమంవల్ల ఏ కొద్దిమందికో పరిమితమైన చదువు వ్యావహారికభాషలో సాగి, అందరికీ అందుబాటులోకి వచ్చింది. పండితులకే పరిమితమైన సాహిత్యసృష్టి, సృజనాత్మకశక్తి ఉన్న ప్రతి ఒక్కరికీ వీలైంది.

గిడుగు వెంకట రామమూర్తి 1863 ఆగష్టు 29వ తేదీ శ్రీకాకుళానికి ఉత్తరాన ఇరవైమైళ్ళ దూరంలో ముఖలింగ క్షేత్రం దగ్గర ఉన్న పర్వతాలపేట అనే గ్రామంలో జన్మించాడు. అతని తండ్రి వీర్రాజు, తల్లి వెంకమ్మ. వీర్రాజు పర్వతాలపేట ఠాణాలో సముద్దారు (రివెన్యూ అధికారి) గా పనిచేస్తుండేవాడు. 1877 దాకా ప్రాథమిక విద్య ఆ ఊళ్ళోనే సాగింది. తండ్ర చోడవరం బదిలీ అయి అక్కడే విషజ్వరంతో 1875 లోనే చనిపోయాడు. తరువాత ..

విజయనగరంలో మేనమామగారి ఇంట్లో ఉంటూ రామమూర్తి మహారాజావారి ఇంగ్లీషు పాఠశాలలో ప్రవేశించి 1875 మొదలు 1880 వరకు విజయనగరంలో గడిపాడు. 1879లో మెట్రిక్యులేషన్‌ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. ఆ రోజుల్లో గురజాడ అప్పారావు రామమూర్తికి సహాధ్యాయి. ఆ ఏడే రామమూర్తికి పెండ్లి అయింది. 1880లో ముప్ఫై రూపాయల జీతం మీద పర్లాకిమిడి రాజావారి స్కూల్లో ఫస్టుఫారం లో చరిత్ర బోధించే అధ్యాపకుడైనాడు. సంసారబాధ్యత (తల్లి, ఇద్దరు చెల్లెళ్ళు) రామమూర్తిపై బడింది. ప్రైవేటుగా చదివి 1886లో ఎఫ్‌.ఏ., 1894లో బి.ఏ. మొదటి రెండు భాగాలు (చరిత్ర తప్ప) ప్యాసయ్యాడు. 1896లో మూడోభాగం ప్యాసై పట్టం పుచ్చుకున్నాడు. ఇంగ్లీషు, సంస్కృతాలు గాక, ప్రధాన పాఠ్యాంశంగా చరిత్ర తీసుకుని రాష్ట్రంలో మొదటి తరగతిలో, రెండోర్యాంకులో ఉత్తీర్ణుడయ్యాడు. రాజావారి ఉన్నత పాఠశాల కళాశాల అయింది. అప్పుడు అతనికి కాలేజి తరగతులకు పాఠాలు చెప్పే యోగ్యత వచ్చింది.
22 జనవరి 1942 న చనిపోయారు .
పూర్తీ వివరాలకోసం -> Gidugu ramamurty

  • ===========================================================

Visit my website -> Dr.seshagirirao-MBBS

Saturday, February 13, 2010

అధికార్ల నరసింహారావు , Adhikarla Narasimharao

అధికార్ల నరసింహారావు కర్ణాటక సంగీతంలో పేరుమోసిన కళాకారులు. శ్రీకాకుళం జిల్లా వాస్థవ్యులు. ఈయన వద్ద ఎంతోమంది శిష్యులు సంగీతము సంగీతమును అభ్యసించి బాగా వృద్ధిలోకి వచ్చారు. పెద్ద పెద్ద కళాకారులతో వారు ఎన్నో సంగీత కచ్చేరీలు ఇచ్చారు మరెన్నో సన్మానాలు పొందారు. వారు త్రికాలాలలో త్రిస్థాయిలలో సంగీతసాధన చేసేవారు.
ఈయనది శ్రీకాకుళంలోని భాగీరధీపురం గ్రామము. ఈయన గురువు ఈశ్వర సత్యనారాయణ.

  • ==============================================================
Visit my website -> Dr.seshagirirao-MBBS

వడ్డాది పాపయ్య, Vaddadi Papayya






















భారతదేశానికి గర్వకారణమైన చిత్రకారుడు వడ్డాది పాపయ్య. ప్రాచీన సాహిత్యాన్ని అకళింపు చేసుకొని తన కుంచెకు సాహితీ సౌరభాన్ని పులిమి చిత్రాలను చిత్రించిన ప్రత్యేక చిత్రకారుడు శ్రీవడ్డాది పాపయ్య.

పవిత్ర నాగావళీ నదీ తీరాన శ్రీకాకుళం పట్టణంలో రామమూర్తి, మహలక్ష్మి దంపతులకు సెప్టెంబరు 10, 1921 ప్రముఖ చిత్రకారుడు వడ్డాది పాపయ్య జన్మించారు. తండ్రి చిత్రకళా ఉపాధ్యాయుడు కావడంతో ఓనమాలు తండ్రి వద్దనే నేర్చి ఐదు సంవత్సరాల పిన్న వయసులోనే తన ఇంటిలో ఉన్న రవివర్మ చిత్రం "కోదండ రామ" ను ప్రేరణగా తీసుకుని హనుమంతుని చిత్రాన్ని గీసారు. పాపయ్య చిన్న తనంలో తండ్రి భారత, భాగవతాలను వినిపిస్తుండేవారు. ఆ ప్రభావం వలన పాపయ్యగారు ఆధునికత కంటే ప్రాచీనత మీద, ముఖ్యంగా భారతీయ శిల్ప,చిత్ర కళల మీద మక్కువ పెంచుకొన్నారు.





పత్రికా రంగంలో--

చిత్రకళ నేర్చుకొంటున్న తొలినాళ్ళలో దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు వీరి చిత్రాలు పత్రికలలో ప్రచురించి ప్రోత్సహించారు. ఆ తరువాత వీరు రేరాణి, మంజూష, అభిసారిక, ఆంధ్రపత్రిక, భారతి, ఆంధ్రజ్యోతి తదితర పత్రికలలో చిత్రాలు గీయటం ప్రారంబించారు.

కొంతకాలం తరువాత చందమామ సంపాదకులు చక్రపాణి పరిచయంతో దాదాపు అర్ధ శతాబ్ధం పాటు చందమామను తన కుంచెతో తీర్చి దిద్దారు. అప్పటిలో చందమామ ఎనిమిది భాషలలో వెలువడుతుండటంతో పాపయ్య చిత్రాలు దేశవ్యాప్తంగా ప్రచారం పొందాయి. యువ మాసపత్రిక లో చిత్రకారులు ఒక చిత్రం గీసే అవకాశం అరుదుగా వచ్చే రోజులలో నెలకు నాలుగు ఐదు చిత్రాలు గీసేవారు పాపయ్య. చందమామ, యువ ,తర్వాత స్వాతి వార, మాస పత్రికలలో దశాబ్ధకాలం పైగా ఈయన చిత్రాలు నడిచాయి.

వడ్డాది పాపయ్యగారు గీసిన చిత్రాల క్రింద 'వ.పా.' అనే పొడి అక్షారాల సంతకం వారి ప్రత్యేకత. వీరి బొమ్మలకు గల మరొక కుంచె గుర్తు '0|0' అని వుండడం. ఇందు గురించి ఆయన చెప్పిన భాష్యం - "గతం శూన్యం, వర్తమానం శూన్యం, భవిష్యత్తులో నిలుచున్నానని".

వ.పా. కేవలం చిత్రకారుడే కాదు. రచయిత కూడా. చందమామలో కొడవటిగంటి కుటుంబరావు మొదలు పెట్టిన 'దేవీభాగవతం' కథలను పూర్తి చేసింది ఆయనే. 'విష్ణుకథ' పౌరాణిక సీరియల్ కూడా ఆయన వ్రాసిందే.



స్వవిశేషాలు--
* 1947 లో నూకరాజమ్మను, 1984 లో లక్ష్మి మంగమ్మను వివాహమాడారు. అయనకు ముగ్గురు కుమారులు మరియు ఒక కుమార్తె. కూతురు అనూరాధ మీద మమకారంతో కశింకోటలో 'పావన కుటీరం' నిర్మించుకొని స్థిరనివాసులయ్యారు.
* సాధారణంగా చిత్రకారులు మోడల్స్ యొక్క నమూనాలనో లేదా వారినే చూస్తూనో చిత్రాలు గీస్తుంటారు. కాని పాపయ్యగారు మాత్రం ఏనాడూ ఆవైపు పోలేదు. తన ఆలోచనల రూపాలనే చిత్రాలుగా చిత్రించేవారు.
* పాపయ్యగారి చిత్రాలలో తెలుగు సంస్కృతి, తెలుగుదనం, ఆచార వ్యవహారాలు, అలంకరణలు, పండుగలు ప్రధాన చిత్ర వస్తువుగా ఉంటాయి.
* లోకానికి తెలియకుండా తనను తాను ఏకాంతంలో బంధించుకొని మరెవరూ దర్శించలేని దివ్య దేవతారూపాలను చిత్రించే పాపయ్యగారు 1992 - డిసెంబర్ 30 న దివ్యలోకాలకు పయనమై వెళ్ళిపోయారు.


  • ===============================================
visit my website -> dr.seshagirirao

రోణంకి అప్పలస్వామి , Ronanki Appalaswamy


























కాన్వెంట్
బాటను పట్టిన నేటి తరానికి ఆయనెవరో తెలియక పోయినా , ముంజేతిలో చేతికర్ర వేలాద దీసి , బెట్టిన దొర టోపీ పెట్టుకొని ... తెక్కలిని అంతర్జాతీయ సాహితీ ప్రపంచానికి పరిచయం చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి రోణంకి అప్పలస్వామి .
అరసం తొలితరం ప్రముఖులు, రాష్ట్రశాఖ అధ్యక్షవర్గ సభ్యులూ అయిన రోణంకి అప్పలస్వామి గారి శతజయంతి ఈ సెప్టెంబరు 15న జరుగనుంది. ఇంగ్లీషు, ఫ్రెంచ్‌, స్పానిష్‌, గ్రీక, హిబ్రూ, ఇటాలియన్‌ మొదలైన ఆరు యురోపియన్‌ భాషలలో నిష్ణాతులు. శ్రీశ్రీ, ఆరుద్రలకు తొలి రోజుల్లో స్ఫూర్తినిచ్చినవారు. అల్లసానిపెద్దన, భట్టుమూర్తి, క్షేత్రయ్య మొదలు శ్రీశ్రీ, నారాయణబాబు, చావలి బంగారమ్మ, చాసో మొదలైనవారి కవితల్ని ఆంగ్లీకరించి దేశ, విదేశీ భాషా పత్రికల్లో ప్రచురించారు.

అప్పలస్వామిగారు శ్రీకాకుళంజిల్లా టెక్కలి సమీపంలోని ఇజ్జవరం అనే గ్రామంలో 1909 సెప్టెంబరు 15న జన్మించారు. తండ్రి రోణంకి నారాయణ్ , తల్లి - రోణంకి చిట్టెమ్మ . తండ్రి పెట్టిన పాఠశాలలో ప్రాథమిక విద్య ముగించుకుని, విజయనగరం, కాశీ హిందూ విశ్వవిద్యాల యాల్లో చదువుకుని ఎం.ఏ. (ఇంగ్లీషు) పట్టభద్రులయ్యారు. విజయనగరం మహారాజు కళాశాలలో సుమారు 30ఏళ్ళు ఉద్యోగం చేసి - ఇంగ్లీషు శాఖాధిపతిగా 1969లో రిటైరయ్యా రు. మరొక రెండేళ్ళు - ఆంధ్ర విశ్వవిద్యాల యంలో ఎమెరిషస్‌ ప్రొఫెసర్‌గా పనిచేశారు. తరువాత టెక్కలిలో స్వగృహం నిర్మించుకుని స్థిరపడ్డారు. 1987 మార్చిలో మరణించారు.

అభ్యుదయ, అవగాహన, ఆంధ్రజ్యోతి, ఆంధ్రపత్రిక, భారతి, ఆంధ్రప్రదేశ్‌, కళాకేళి, ప్రజారధం, సృజన మొదలగు పత్రికలలోనూ అనేక ప్రత్యేక సంచికల్లోనూ వ్యాసాలు ప్రచురించారు. సమాచారశాఖ వారికోసం కోడి రామమూర్తిపై చిన్న పుస్తకం రచించారు. కేంద్ర సాహిత్య అకాడమి కోసం మాకియ వెల్లీ ''ప్రిన్స్‌''ను - నేరుగా ఇటాలియన్‌ భాషనుండి తెలుగు చేశారు. మానేపల్లి, చిత్రభాను, మోహనప్రసాద్‌, చాగంటి తులసి - మొ||వారి పుస్తకాలకు ముందుమాటలు రాశారు. ఆరుద్ర తన తొలి కావ్యం -'త్వమేవాహం'నూ మానేపల్లి తన తొలి కవితా సంపుటి 'వెలిగించే దీపాలు'ను గురువుగారికి అంకితం ఇచ్చారు. 1980ల్లో ఆధునిక కవితా పితామహుడు గురజాడ అనీ, శ్రీశ్రీ తానే పితామహుడిననడం తగదని - జరిగిన వాదోపవాదాలకు గట్టి సమాధానం చెప్పారు. విశాఖపట్నం ఆకాశవాణి నుండి తెలుగు, ఇంగ్లీషులలో పలు ప్రసంగాలు చేశారు. రావూరి భరద్వాజగారు - ప్రత్యేకంగా ఆయన చేత హైదరాబాద్‌ ఆకాశవాణి కేంద్రాలనుండి ప్రసంగాలు చేయించారు.

టెక్కలి వారి స్వగృహంలో వివిధ యురోపి యన్‌ భాషలకు చెందిన అరుదైన గ్రంథాలు ఇప్పటికీ అలాగే వున్నాయి. వాటిని విశాఖనగర పౌర గ్రంథాలయానికి తరలించాలన్న ప్రయత్నాలు ఇంకా ఫలించలేదు. ఆయన రచనలు ఎన్నడూ జాగ్రత్త చేయలేదు. పోయినన్ని పోగా మిగిలిన తెలుగు, ఇంగ్లీషు రచనల్ని పుస్తకంగా తీసుకువచ్చే ప్రయత్నాలు మొదలయ్యాయి. వారి ఇంగ్లీషు కవితలు లోగడ - సాంగ్స్‌ అండ్‌ లిరిక్స(1935), ది నావ్‌ అండ్‌ అదర్‌ పోయమ్స్‌ (1985) పేర పుస్తక రూపంలో వచ్చాయి.

కాళీపట్నం రామారావు , Kashipatnam Ramarao



కాళీపట్నం రామారావుగారు - ఎలిమెంటరీ స్కూలు హెడ్మాస్టరుగా రిటైరయ్యారు. కారా మాస్టారు గా పసిద్ది పొందిన కాళీపట్నం రామారావు సరళ భాషా రచయిత, కథకుడు, విమర్శకుడు. వృత్తిరీత్యా ఉపాధ్యాయులైన ఈయన రచనా శైలి సరళంగా ఉండి సామాన్యజ్ఞానం కల పాఠకులు సైతం రచనలో లీనమయ్యేలా, భావప్రాధాన్య రచనలు చేసారు . ప్రసిద్ధ నవలా రచయిత అయిన యండమూరి వీరేంధ్రనాధ్ రామారావు రచనల నుండి ప్రేరణ పొంది ఆయనను గురువుగా భావించేవాడు. ఈయన చేసిన రచనలు తక్కువైనా అత్యంత సుప్రసిద్ధమైన రచనలు చేసారు.

"యజ్ఞం" కథారచయితగా సుప్రసిద్ధులు. ఈ ఒక్క కథ రేపిన సంచలనం, ఈ కథ గురించి జరిగిన చర్చ తెలుగులో ఏ ఒక్క కథకీ జరగలేదంటే అతిశయోక్తి కాదేమో.
ఎప్పుడో ఆంప్ర సాహిత్య ఎకాడెమీ ఈయనకి అవార్డు ఇస్తే ప్రభుత్వవిధానాల పట్ల నిరసనతో ఆ అవార్డుని తిరస్కరించారు - బ్రహ్మానందరెడ్డి హయాంలో కావచ్చు. ఆ తరవాత 1995 ప్రాంతంలో కేంద్ర సాహిత్య ఎకాడెమీ ఎవార్డు ప్రకటించినప్పుడు మేస్టారు సందిగ్ధంలో పడ్డారు. ఆ ఎవార్డుని తెలుగు కథకి ఉపయోగకరంగా వాడవచ్చు అని చాలామంది ఆత్మీయులిచ్చిన ప్రోత్సాహంతో ఎవార్డుని స్వీకరించారు. ఎవార్డుగా
వచ్చిన సొమ్ముని మూలధనంగా పెట్టి కథానిలయానికి పునాది వేశారు.
కారామేస్టారి భావనలో కథానిలయం నిజంగా తెలుగు కథకి నిలయం. అక్కడ దొరకని తెలుగు కథ అంటూ ఉండకూడదని ఆయన ఆశయం. ప్రచురితమైన ప్రతి తెలుగు కథా అక్కడ ఉండాలి. కథలతో పాటు కథా రచయితల జీవిత విశేషాలు, ఛాయాచిత్రాల సేకరణ కూడా చేపట్టారు. ఎక్కడెక్కడి పాత పత్రికల కాపీలు సంపాదించడంలో విపరీతంగా శ్రమించారు.
కథానిలయం రెండంతస్తుల భవనం. శ్రీకాకుళం పట్టణంలో ఉంది. విశాఖ నించి నాన్-స్టాపు బస్సులో రెండు గంటల్లో వెళ్ళొచ్చు. కలకత్తా రైలు మార్గం మీద ఆమదాలవలసలో శ్రీకాకుళం రోడ్ అనే స్టేషను కూడా ఉంది. భవనంలో కింది అంతస్తు ప్రధాన పుస్తక భండాగారం. వెనక వేపు అరుదైన పుస్తకాల బీరువాలు. ఇక్కడే తెలుగు కథా త్రిమూర్తులు - గురజాడ, కొకు, రావిశాస్త్రులవి పెద్ద తైలవర్ణ చిత్రాలున్నాయి. పై అంతస్తులో ముందు
ఒక వందమంది దాకా కూర్చోవటానికి వీలైన పెద్ద హాలు. ఈ హాలు గోడల నిండా అంగుళం ఖాళీ లేకుండా తెలుగు కథా రచయితల ఫొటోలు. వెనక వైపున ఒక అతిధి గది బాత్రూము సౌకర్యంతో సహా - ఎవరైనా లైబ్రరీని ఉపయోగించుకోవటానికి వస్తే రెండు మూడు రోజులు సౌకర్యంగా ఉండొచ్చు.
ప్రతి ఏడూ మార్చి ప్రాంతంలో కథానిలయం వార్షికోత్సవం తన ఇంట్లో శుభకార్యంలాగా నిర్వహిస్తారు. బయటి ఊళ్ళ నించి చాలామంది కథకులూ, కథాభిమానులూ వస్తారు.
పనికట్టుకునైనా ఒక సారి వెళ్ళి చూడండి. కారామేస్టార్ని కలవండి.

కథానిలయం

కధా నిలయం, తెలుగు కధల సేకరణకు అంకితమైన ఒక గ్రంధాలయం. ప్రఖ్యాత కథకుడు కాళీపట్నం రామారావు తనకి వచ్చిన పురస్కారం అంతటినీ వెచ్చించి శ్రీకాకుళంలో ఫిబ్రవరి 22, 1997 సంవత్సరంలో ఈ గ్రంధాలయాన్ని స్థాపించేరు. తరువాత స్నేహితులు, దాతలు విరాళాలు ఇచ్చేరు. తెలుగులో రాయబడ్డ ప్రతి కథనీ ఈ గ్రంధాలయంలో భద్రపరచాలని స్థాపకుల ఆకాంక్ష.

తెలుగు సాహిత్యంలో ప్రచురించబడిన కధలను భావి తరాలవారికి పొందుపరచాలన్న బృహత్తర ఆశయంతో కాళీపట్నం రామారావు కధానిలయాన్ని స్థాపించాడు. తెలుగు కధకు అత్యుత్తమమైన ఇటువంటి రిఫరెన్సు గ్రంధాలయం ఏర్పరచే కృషి ఇంతకుముందు జరుగలేదని ప్రొఫెసర్ గూటాల కృష్ణమూర్తి అన్నాడు.

1997లో ఆరంభమైన ఈ "కథా నిలయం"లో (2000నాటికి) 4,000పైగా వారపత్రికలు, మాస పత్రికలు, విశేష పత్రికలు ఉన్నాయి. యువ, జ్యోతి, జాగృతి, ఆంధ్రజ్యోతి, ఆంధ్ర పత్రిక, భారతి, జయంతి, సంవేదన, అభ్యుదయ వంటి అనేక పత్రికల అమూల్యమైన సేకరణ ఇది. 1944 నుండి భారతి పత్రిక ప్రతులు ఇక్కడ సేకరించారు. అంతకు పూర్వపు ప్రతులను కూడా సేకరించే ప్రయత్నం జరుగుతున్నది.

ఇంకా కధానిలయంలో 2,000 పైగా కధల సంపుటాలు, కధా రచనల గురించిన మరో రెండు వేల పుస్తకాలు ఉన్నాయి. 1910లో ప్రచురించిన అక్కిరాజు ఉమాకాంతం రచన త్రిలింగ కధలు ఇక్కడి సేకరణలలో అన్నింటికంటే పాతది. తెలుగు రచనలలో క్రొత్త పుంతలకు దారి తీసినవని భావించే యద్దనపూడి సులోచనారాణి, యండమూరి వీరేంద్రనాధ్ వంటి రచయితల నవలలు కూడా కొన్ని ఈ సేకరణలో ఉన్నాయి. తెలుగులో షుమారు 3,000 మంది కధా రచయితలు ఉండవచ్చునని, కాని వారిలో 600 మంది రచనలే తమ సేకరణలోకి తేగలిగామని కా.రా. అన్నాడు. కొద్దిపాటి కధలు వ్రాసిన రచయితలు తమ రచనలు అంత ప్రముఖమైనవి కాకపోవచ్చునని భావించి, తమ రచనలు పంపరు. అయితే ప్రతి కధా ఏదో ఒక దృక్పధాన్ని లేదా సమాజ స్థితిని లేదా ఘటనలను వెలికి తీస్తుందని "కారా" భావన.


కారా జీవిత విశేషాలు :
  • పుట్టుక : 1924 లో ,
  • బాల్యము : శ్రీకాకుళం జిల్లాలో పల్లెపట్టు న ,
  • చదవు : శ్రీకాకులములో S.S.L.C వరకు , భీమిలిలో సెకెండరి గ్రేడ్ ట్రయినింగ్ ,
  • ఉద్యోగాలు : 1943 నుంది 1046 వరకూ నలుగైదు చోట్ల , స్థిరముగా ఇమడగలిగింది ఉపాద్యాయవృత్తిలో 1948 నుండి 31 ఏళ్ళు ఒకే ఎయిడెడ్ హైస్కుల్ లో ఒకేస్థాయి ఉద్యోగము . 1972 నుండి నేటివరకు పెన్సనర్ గానే జీవితము .

తనమాటల్లో "ఈ లోకములో నా శైశవం 1935 నుండి పాఠకుడుగా బాల్యము , 1940 - 1942 వరకు రాసేందుకు ఆశక్తి ప్రయత్నము .1943 నుండి ఐదేళ్ళు చిన్నచితగా పత్రికల్లో ఏవోవో కొన్ని రచనలు . 1948 నుండి ఆంధ్రపత్రిక ఉగాది సంచికలూ , భారతి వంటి పత్రిలలో పన్నెండు వరకు ఒక స్థాయి కధలు రాయగలిగాను . 1957 నుండి ఉన్నతస్థాయి కధలు రాయగలిగేందుకు అధ్యయనము . అది ఫలించి 1963 నుండి పదేళ్ళు పాటు మరో పన్నెందు కధానికలు రాయగలిగేను . ఆ తర్వాత కధలైతే రాయలేకపోయాను కాని కధను గురించిన అధ్యనము , అందుకవసరమైన ఇతర ప్రక్రియలలో సహా చదువూ నేటికీ కొనసాగుతూనే వున్నాయి. అభిప్రాయాలు పదిమంది తో పందుకోచడమూ ఆగలేదు ".

  • ===============================
visit my website - > Dr.seshagirirao MBBS